కరోనా కంటే మత విద్వేషం ప్రమాదకరం

ABN , First Publish Date - 2020-12-21T02:59:24+05:30 IST

కరోనా కంటే మత విద్వేషం ప్రమాదకరమైందని సామాజిక విశ్లేషకుడు జి.భార్గవ్‌ అన్నారు.

కరోనా కంటే మత విద్వేషం ప్రమాదకరం
సభకు హాజరైన ప్రజలు

సామాజిక విశ్లేషకుడు జి.భార్గవ్‌ 

అందరి కోసమే రైతుల పోరాటం 

రైతు స్వరాజ్యంనేత కన్నెగంటి రవి


పాలమూరు, డిసెంబరు 20: కరోనా కంటే మత విద్వేషం ప్రమాదకరమైందని సామాజిక విశ్లేషకుడు జి.భార్గవ్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో అష్ఫాఖుల్లాఖాన్‌, రాంప్రసాద్‌ బిస్మిల్‌ స్మారక సమి తి ఆధ్వర్యంలో ఎస్‌ఎం ఫంక్షన్‌ హాలులో వర్ధంతి సభకు కన్వీనర్‌ హనీఫ్‌అహ్మద్‌ ఆధ్యక్షత వహించా రు. ఆనాడు బ్రిటీష్‌ పాలకులు దేశంలో మతాలు, ప్రజల మధ్య విభజించే కుట్రలకు పాల్పడితే వాటి కి వ్యతిరేకంగా అష్ఫాఖుల్లాఖాన్‌, రాంప్రసాద్‌ బిస్మి ల్‌లు పోరాటం చేశారని గుర్తు చేశారు. భిన్న సం స్కృతులు, సంప్రదాయాలకు నిలయమైన భారత దేశంలో సకల వర్గాలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నాయని వివరించారు. దేశంలో ప్రజలను విడగొట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నా రు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం అందరి కోసమని రైతు స్వరాజ్యం నేత కన్నెగంటి రవి అన్నారు. ఈ చట్టాల తో రైతుల భూములు కార్పొరేట్ల గుప్పిట్లోకి వెళతా యన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా మహోన్నత పోరాటాలు నడిపారని, దేశ ప్రజలందరి వలస విముక్తి కోసం పండిత్‌ రాం ప్రసాద్‌ బిస్మిల్‌, అష్ఫాఖుల్లాఖాన్‌లు 1927లో ఉరి తీయబడ్డారని వివరించారు. అంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా గాంధీ చేసిన ఉద్యమంలో నిరసన వ్యక్తం చేసి సాయుధ పోరాట పంథాలలో పని చేశారని గుర్తు చేశారు. చివరకు కాకారి ఘటన కేసులో నిర్భంధించి ఏకపక్షంగా బ్రిటీష్‌ ప్రభుత్వం ఉరి తీసిందన్నారు. ముస్లిం మతపెద్ద గులాం మహమ్మద్‌, హనీఫ్‌అహ్మద్‌, ఎం.రాఘవాచారి, డీసీ సీ అధ్యక్షుడు ఒబేదుల్లాకొత్వాల్‌, షేక్‌ఫరూఖ్‌ హుస్సేన్‌, ఎస్‌ఎం ఖలీల్‌, విజయ్‌ఖుమార్‌, సమద్‌ ఖాన్‌, నూరుల్‌హాసన్‌, ముస్తాక్‌, చిన్న, పరమేశ్వర్‌, చాంద్‌, మొయిదుద్దీన్‌, మిర్జాఖుద్దూస్‌బేగ్‌, సుజాత్‌ అలీ, శ్రీదేవి, శ్రీశైలం, తిమ్మప్ప, వెంకటేశ్వర్లు ప్రసంగించారు. Updated Date - 2020-12-21T02:59:24+05:30 IST