కొత్తగా 54 కేసులు

ABN , First Publish Date - 2020-11-22T03:56:20+05:30 IST

కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

కొత్తగా 54 కేసులు

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)/నారాయణపేట క్రైం/గద్వాల క్రైం/వనపర్తి/నాగర్‌ కర్నూల్‌ క్రైం, నవంబరు 21 : కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పది రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కేసుల నమోదు తగ్గుతూ వస్తుండ టంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా నారాయణపేట జిల్లాలో ఒకే ఒక్క కేసులు నమోదు కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 54 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అందులో అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 27 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది.

- మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా శనివారం 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదమ్యాయి. అందులో అత్యధికంగా జిల్లా కేంద్రంలోనే 13 మందికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. మిగిలిన 14 కేసులు వివిధ మండలాల్లో వచ్చాయి.

- జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదు కాగా, అందులో జిల్లా కేంద్రంలో ఇద్దరికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది.

- నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా 19 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో అత్యధికంగా నాగర్‌కర్నూల్‌ మండలంలో ఏడుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మిగిలిన 12 కేసులు వివిధ మండలాల్లో వచ్చాయి.

- వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఆరు కరోనా కేసులు నమోదు కాగా, అందులో ఒక్క పెబ్బేరు మండలంలోనే నలుగురికి వైరస్‌ సోకింది.

- నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఒకే ఒక్క కరోనా కేసు నమోదైంది.

Updated Date - 2020-11-22T03:56:20+05:30 IST