పట్టుబడిన రేషన్‌ బియ్యం

ABN , First Publish Date - 2020-07-20T11:31:50+05:30 IST

మండల కేంద్రంలోని మూడో రేషన్‌షాపులో శని వారం 95క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నామని జిల్లా సివిల్‌ సప్లయ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డీటీ రామ్మోహన్‌

పట్టుబడిన రేషన్‌ బియ్యం

కోడేరు, జూలై 19: మండల కేంద్రంలోని మూడో రేషన్‌షాపులో శని వారం 95క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నామని జిల్లా సివిల్‌ సప్లయ్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డీటీ రామ్మోహన్‌ ఆదివారం తెలిపారు. రామ్మోహన్‌ కథనం ప్రకారం.. ఇతర జిల్లాలకు సంబంధించిన రేషన్‌ బియ్యం ఇక్కడ రావడం జ రిగిందని, కరోనా సందర్భంగా లబ్ధిదారుల థంబ్‌ లేకపోవడంతో కావలికార్లు, అంగన్‌వాడీ టీచర్లు తదితరుల థంబ్‌తో రేషన్‌ ఇవ్వడంతో ఇక్కడ కూడా వారి పేర్ల మీద తీసుకున్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల వారికి బియ్యం ఇక్కడ తీసుకోవడంతో విచారణ చేసి రేషన్‌ షాపు డీలర్‌పై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. రేషన్‌ డీలర్‌ శారదను వివరణ కోరగా, వారి బియ్యం ఇక్కడనే స్టాక్‌ ఉందని, వాటిని ఎక్కడికీ తరలించలేదని, మా షాపులో పని చేసే వారి పొరపాటు వలన ఇలా జరిగిందన్నారు. డీలర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి తెలిపారు.

Updated Date - 2020-07-20T11:31:50+05:30 IST