-
-
Home » Telangana » Mahbubnagar » Calf killed in hyena attack
-
హైనా దాడిలో లేగదూడ మృతి
ABN , First Publish Date - 2020-12-28T03:28:17+05:30 IST
అడవి జంతువు హైనా దాడిచేసిన సంఘటనలో లేగదూడ మృతిచెందిన సంఘటన మక్తల్ మండలం యర్నాగన్‌పల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.

మక్తల్‌రూరల్, డిసెంబరు 27 : అడవి జంతువు హైనా దాడిచేసిన సంఘటనలో లేగదూడ మృతిచెందిన సంఘటన మక్తల్ మండలం యర్నాగన్‌పల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. ఆదివారం యర్నాగన్‌పల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో కట్టేసిన లేగదూడపై హైనా (మెకం) దాడిచేసి చంపివేసింది. కాగా గ్రామస్థులంతా మృతిచెందిన లేగదూడను చూసి చిరుతపులి దాడి చేసి ఉండవచ్చని భయాందోళన చెందారు. తాజాగా దేవరకద్ర మండలంలో పులి సంచరించినట్లు వెల్లడికావడంతో ఇక్కడ కూడా చిరుతపులి వచ్చి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సంఘటనాస్థలానికి అటవీశాఖ అధికారులు, పశువైద్య అధికారులు చేరుకొని చనిపోయిన దూడను ఆనవాళ్లను పరిశీలించి లేగదూడను చంపింది హైనా అని తేల్చారు. కార్యక్రమంలో ఎస్సై ఏ.రాములు, ఫారెస్టు బీట్ ఆఫీసర్ జీవిత, వెటర్నరీ అసిస్టెంట్ ఆంజనేయు లు, గ్రామస్థులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.