-
-
Home » Telangana » Mahbubnagar » byke accident
-
బైక్ అదుపు తప్పి ముగ్గురికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2020-12-29T03:48:08+05:30 IST
బైకు అదుపు తప్పి ముగ్గురు వ్యక్తులకు తీవ్రగా యాలైన సంఘటన మండల పరిధిలోని కల్వకోల్ గ్రామ శివారులో సోమవారం జరిగింది.

పెద్దకొత్తపల్లి, డిసెంబరు 28: బైకు అదుపు తప్పి ముగ్గురు వ్యక్తులకు తీవ్రగా యాలైన సంఘటన మండల పరిధిలోని కల్వకోల్ గ్రామ శివారులో సోమవారం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దకొత్తపల్లి మండలం ఆవిరాల గ్రామానికి చెందిన విష్ణు, మధు, సాయి అనే ముగ్గురు యువకులు పని నిమిత్తం కొల్లాపూర్ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కల్వకోల్ గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి కింద పడడంతో తీవ్ర గాయాలకు గురయ్యారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108అంబులెన్స్ కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా విష్ణు, మధుల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.