టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: బీజేవైఎం

ABN , First Publish Date - 2020-12-16T04:24:01+05:30 IST

నిరుద్యోగులకు మోసం చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె తిరుపతి అన్నా రు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: బీజేవైఎం

మిడ్జిల్‌, డిసెంబరు 15: నిరుద్యోగులకు మోసం చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె తిరుపతి అన్నారు. మంగళవారం బీజేవైఎం ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తున్నదని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికలప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతీ యువకులకు మోసం చేసిందని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ మరోసారి నిరుద్యోగు లను మోసం చేసేందుకే ఉద్యోగాలు భర్తీ చేస్తామని బూటకపు మాటలు చెబుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, నిరుద్యోగులకు పెద్దపీట వేస్తామన్నారు. కార్యక్ర మంలో బీజేపీ జిల్లా కార్యదర్శి రాజేశ్వర్‌, నాయకులు వాసుదేవ్‌, భాస్కర్‌ నాయక్‌, నాగేష్‌, జగన్‌, శ్రీశైలం, భీమయ్య, దేవేందర్‌, రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-16T04:24:01+05:30 IST