బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-12-21T02:52:11+05:30 IST

చిన్నరాజమూర్‌ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబవుతోంది.

బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు
చిన్నరాజమూర్‌ ఆంజనేయస్వామి దేవాలయం

భక్తుల ఇలవేల్పుగా చిన్నరాజమూర్‌ ఆంజనేయ స్వామి 

27 నుంచి జనవరి 1 వరకు ఉత్సవాల నిర్వహణ 


దేవరకద్ర, డిసెంబరు 20: చిన్నరాజమూర్‌ ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబవుతోంది. దేవరకద్ర మండలం చిన్నరాజమూర్‌లో వెలసి న ఆంజనేయ స్వామి ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. జిల్లా నలుమూలల నుంచే కాక కర్ణాటక, మహారాష్ట్రల నుంచి పలువురు భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి చిన్నరాజమూర్‌కు వస్తా రు. ప్రతి సంవత్సరం డిసెంబరులో వారం రోజులపా టు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. దేవరకద్ర నియో జకవర్గంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాల్లో చిన్నమూర్‌ ఆలయం ప్రసిద్ధి. దేవరకద్ర పట్టణం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో కోయిల్‌సాగర్‌కు వెళ్లే దారిలో ఉంది. ఎండో మెంట్‌ శాఖ పరిధిలో ఉన్న ఈ  దేవాలయంలో ఇటీవల వివిధ అభివృద్ధి పనులను చేపట్టి పూర్తి చేశారు. ఈ నెల 27 నుంచి 1 వరకు స్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరలో కొవిడ్‌ నిబం దనలు తప్పకుండా పాటించేవిధంగా చర్యలు తీసు కుంటున్నారు. 


400 ఏళ్ల చరిత్ర

చిన్నరాజమూర్‌ ఆంజనేయ స్వామికి దాదాపు నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. పూర్వ కాలంలో వ్యాస మహర్షిచే తుంగభద్రనది తీరంలో ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. కార్యక్రమంలో స్వామి వారి విగ్రహం భూస్థాపితమైంది. ఆ తరువాత కాలంలో వడ్డేప ల్లి మండలంలోని ఓ రైతు పొలం దున్నుతుండగా నాగలికి తగిలి బయట పడ్డ ఆంజనేయస్వామి విగ్ర హాన్ని తీసి బయట ఉంచి పూజలు నిర్వహించాడని చెబుతారు. అదే రోజు రాత్రి రైతు కలలో కనిపించిన ఆంజనేయస్వామి తన విగ్రహాన్ని ఉత్తర దిశగా ఎడ్ల బండిపై తీసుకెళ్లమని, ఎక్కడయితే బండి చక్రాలకు ఉన్న ఇరుసు విరిగి పోతుందో అక్కడ విగ్రహాన్ని ప్రతిష్టించాలని చెప్పినట్టు కథ ప్రాచుర్యంలో ఉంది. స్వామి వారి ఆజ్ఞ మేరకు ఆ రైతు ఆంజనేయస్వామి విగ్రహాన్ని బండిపై తీసుకొని ఉత్తర దిశలో ప్రయాణిం చాడు. చిన్నరాజమూర్‌ శివారులోకి వచ్చిన తరువాత బండి ఇరుపు విరిగి పడింది. దీంతో విగ్రహాన్ని అక్కడే శాస్ర్తోక్తంగా హోమాలు చేసి ప్రతిష్ఠించినట్లు గ్రామస్థు లు చెబుతున్నారు. ఆ నాటి నుంచి ప్రతి ఏడాది ఉత్స వాలు జరుపుకుంటున్నారు. ఇక్కడ వెలసిన ఆంజనే య స్వామి గర్భ గుడికి నేటికీ గోపురం లేదు. గతంలో ఎందరో పై కప్పు వేయడానికి ప్రయత్నించి విఫలమై నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-12-21T02:52:11+05:30 IST