బోరు మోటారు తీసేందుకు వెళ్లి మృత్యువాత

ABN , First Publish Date - 2020-12-12T03:51:43+05:30 IST

బోరుమోటారు తీసేందుకు రైతుకు సహాయం చేద్దామని వెళ్లి మోహన్‌లాల్‌ అనే వ్యక్తి మృతి చెందాడు.

బోరు మోటారు తీసేందుకు వెళ్లి మృత్యువాత
మోహన్‌లాల్‌(ఫైల్‌)

- కేఎల్‌ఐ కాలువలో తేలిన శవం

తిమ్మాజిపేట(మారేపల్లి), డిసెంబరు 11: బోరుమోటారు తీసేందుకు రైతుకు సహాయం చేద్దామని వెళ్లి మోహన్‌లాల్‌ అనే వ్యక్తి మృతి చెందాడు. మండల పరిధిలోని మారేపల్లి గ్రామ సమీపంలో కేఎల్‌ఐ కాలువలో ఏర్పాటు చేసిన బోరు మోటారు కాలిపోవడంతో దానిని తీసేందుకు అదే గ్రామానికి చెందిన ఓ రైతు గురువారం మోహన్‌లాల్‌ను సహాయం కోరాడు. పిలిచిన వెంటనే అతడు కాలువలోకి దిగి మోటారును బయటకు తీసే ప్రయత్నంలో అక్కడే మునిగి పోయాడు. శుక్రవారం ఫైర్‌ ఇంజన్‌ సిబ్బంది వచ్చి శవాన్ని బయటకు తీశారు. తహసీల్దార్‌ సరస్వతి పంచనామా నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య ప్రమీల, కుమార్తె, కుమారుడు ఉన్నారు.



Updated Date - 2020-12-12T03:51:43+05:30 IST