నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-12-16T03:44:15+05:30 IST

నిరుద్యోగ సమస్యను పరిష్కరిం చాలని బీజేవైఎం, బీజేపీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో యువకులు ఆందోళన చేపట్టారు.

నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి
అయిజ తహసీల్దార్‌ కార్యాలయం ముందు నాయకుల నిరసన

- బీజేవైఎం ఆధ్వర్యంలో  ధర్నాలు, నిరసనలు

    కేటీదొడ్డి/రాజోలి/అయిజ, డిసెంబరు 15: నిరుద్యోగ సమస్యను పరిష్కరిం చాలని బీజేవైఎం, బీజేపీ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో యువకులు ఆందోళన చేపట్టారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కేటీదొడ్డి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బీజేవైఎం మండల అధ్యక్షుడు నందిన్నె మహాదేవ్‌ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌ సుభాష్‌నాయుడికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో శ్రీపాదరెడ్డి, వీరేష్‌రెడ్డి, శ్రీను, మహేష్‌గౌడ్‌, అంజి, జంగిలప్ప, నర్సింహులు, రంగస్వామి పాల్గొన్నారు.  రాజోలిలో బీజేపీ జిల్లా ప్రధాన కార్య దర్శి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌ వెంకటరమణకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు మధుసుదన్‌ గౌడు, మండల అధ్యక్షుడు అశోక్‌, నాయకులు నర్సింహులు, సోమశేఖర్‌, గట్టు రాము పాల్గొన్నారు. అయిజ తహసీల్దార్‌ కార్యాలయం ముందు బీజేవైఎం నాయకులు నిరసన తెలిపారు. తహసీల్దార్‌ యాదగిరికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో మండల అ ధ్యక్షుడు శేఖర్‌, కార్యదర్శి గోపాలకృష్ణ, ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, పరశురా ములు, ఓబీసీ ఉపాధ్యక్షుడు వెంకటేష్‌యాదవ్‌, విద్యావలంటీర్ల సంఘం నాయకులు రాముడు, నరసింహ, ధనుంజయ, రామకృష్ణ పాల్గొన్నారు.


మళ్లీ మభ్య పెట్టేందుకు నోటిఫికేషన్‌

    గద్వాల రూరల్‌: నిరుద్యోగులను  కేసీఆర్‌ ప్రభుత్వం నిండా ముంచిందని, వారిని మళ్లీ మభ్యపెట్టేందుకు ఉద్యోగ నోటిఫికేషన్‌ పేరుతో ముందుకు వస్తోందని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. గద్వాల తహసీల్దార్‌ కార్యాలయం ముందు మంగళవారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. యువతీయువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూసి అలసిపోయారని, కుటుంబ పోషణకు ఉపాధి కూలీలుగా మారారని అన్నారు. అనంతరం తహసీల్దార్‌ సత్యనారాయణ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ధర్నాలో మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు డీటీడీసీ నర్సింహా, నర్సింహా తదితరులు ఉన్నారు.


తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా

    మల్దకల్‌/మానవపాడు : నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కిసాన్‌మోర్చ జిల్లా అధ్యక్షుడు పాల్వాయిరాముడు ఆధ్వర్యంలో మంగళ వారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం తహసీల్దార్‌ మీర్‌ అజాంఅలీకి వినతిపత్రం అందించారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, నాయకులు చంద్రన్న, వెంకటేష్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, కిషోర్‌, బుడ్డన్న, సంతోష్‌, ప్రసాద్‌, కృష్ణారెడ్డి, గోకుల్‌, ఆనంద్‌, బజారన్న ఉన్నారు. మాన వపాడు తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. మధుకుమార్‌, నాయకులు వినోద్‌కుమార్‌, లింగేష్‌, లాలు ఉన్నారు. 


Read more