బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు
ABN , First Publish Date - 2020-10-28T10:42:50+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.

సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు దిష్టిబొమ్మలు దహనం
పలు చోట్ల బీజేపీ నాయకుల అరెస్ట్
వనపర్తి అర్బన్/ కొత్తకోట/ పెబ్బేరు/ వీపనగండ్ల, అక్టోబరు 27: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కృష్ణ, వెంకటేశ్వరరెడ్డి, రామన్ గౌడ్, సీతారాములు, శ్రీశైలం, పరశురాం, వెంకట్, పెద్దిరాజు, సూరి, కుమార్, రామ్మోహన్, సూగూరు రాము, సామిల్, సుబ్రమణ్యం, ఎండీ కరీం పాల్గొన్నారు. కొత్తకోటలో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ భరత్ భూషణ్ మాట్లాడారు. వెంకట్‌రెడ్డి, దాబ శ్రీనివాస్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, నవీన్‌కు మార్రెడ్డి, నరేం దర్‌గౌడ్, ప్రవీణ్‌కుమార్, రవీందర్‌గౌడ్, ఉమాశంకర్ యాదవ్, బాలస్వామి, లచ్చాగౌడ్, అమరేందర్‌రెడ్డి, రాజారాం యాదవ్ పాల్గొన్నారు. వీపనగండ్ల, చిన్నంబావి మండల కేంద్రాల్లో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు దిష్టిబొమ్మలను దహనం చేశారు. శ్రీధర్‌రెడ్డి, రాకేష్‌యాదవ్, మల్లయ్య, నారాయణ, శేఖర్‌యాదవ్, శ్రీకాంత్, కేశవులు, మహే ష్, బాలకృష్ణ, శశిధర్, మద్దిలేటి, నరసింహస్వామి, విజయ, పవన్ పాల్గొన్నారు. పెబ్బేరులో బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహిస్తుండగా పోలీసు లు వారిని అరెస్టు చేశారు. బీజేపీ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో నేలపై కూర్చొని ధర్నాను కొనసాగించారు. కౌన్సిలర్ గోపిబాబు, బుచ్చన్న విజయ్‌కుమార్‌రెడ్డి, నాగరాజుయాదవ్, లోకేష్‌గౌడ్, సర్వేష్గౌడ్, రాజు, నరేష్, రవి ఉన్నారు.
ఓటమి భయంతోనే బీజేపీ నాయకులపై కేసులు
ఆత్మకూర్/ అమరచింత/ పెద్దమందడి: దుబ్బాకలో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ పార్టీ బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేసి జైల్లో పెడుతుందని ఆ పార్టీ మునిసిపల్ ఫ్లోర్ లీడర్ అశ్వినికుమార్, పట్టణ అధ్యక్షుడు విజయ్ అన్నారు. ఆత్మకూర్ పట్టణ కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో, అమరచింతలో మంగళవారం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. క్యామ భాస్కర్, శశికాంత్, ఆనంద్, నాగేందర్‌రెడ్డి, శేషు, సమద్, రఘు, అమరచింత బీజేపీ నాయకులు మేర్వరాజు, నరాల నారాయణ, వెంకటేశ్వర్లు, పారుపల్లి సురేష్, హరీష్, మల్లారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, బీజేవైఎం యువకులు పాల్గొన్నారు. పెద్దమందడి మండలంలో బీజేపీ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. చెన్నయ్య, శివారెడ్డి, దినకర్, రాజవర్ధన్, విష్ణు, గోవర్దన్, ఉపాధ్యక్షుడు సతీష్ కుమార్, అశోక్, సూర్య తదితరులు పాల్గొన్నారు.