రైతుల కోసమే సంస్కరణలు

ABN , First Publish Date - 2020-12-18T04:31:39+05:30 IST

రైతుల కోసమే సంస్కరణలు

రైతుల కోసమే సంస్కరణలు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న డీకే అరుణ

- బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

    గద్వాలటౌన్‌, డిసెంబరు 17 : రైతులను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని నరేద్రమోదీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలకు సంస్కరణలను తీసుకొచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. రైతులను తప్పుదోవ పట్టించి ఉద్యమాల వైపు ఉసిగొల్పుతున్న ప్రతిపక్షాల తీరు నీతి బాహ్యం అన్నారు. జిల్లా కేంద్రంలోని డీకే బంగ్లాలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వ్యవసాయరంగంలో సంస్కరణలు అవసరమని తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో చెప్తున్న విపక్షాలు, వాటిని చట్ట రూపంలో తెచ్చిన కేంద్ర ప్రభుత్వం విమర్శలు గుప్పించడం దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు. భారత్‌ బంద్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన దిగజారుడుతనాన్ని ప్రదర్శించిదన్నారు. రాష్ట్రంలో రైతు రుణ మాఫీపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. రైతుబంధు పేరుతో కొంత మందికి మాత్రమే లబ్ధి చేకుర్చుతూ రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడడం దౌర్భాగ్యం అని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసం ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రైతులకు పిలుపునిచ్చారు. విలేఖరుల సమావేశంలో నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రాంచంద్రరెడ్డి, రామాంజనేయులు, అక్కల రమాదేవి, రాజశేఖర్‌రెడ్డి, సంజీవ్‌, భరధ్వాజ్‌, వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-18T04:31:39+05:30 IST