పత్తి రైతులకు ఇబ్బంది కలిగించొద్దు
ABN , First Publish Date - 2020-12-02T03:08:32+05:30 IST
పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు.
కల్వకుర్తి అర్బన్, డిసెంబరు 1: పత్తి కొనుగోళ్లలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం పత్తి మిల్లుల యజమానులు సీసీఐ, రెవెన్యూ మార్కెటింగ్ అధికారులతో పత్తి కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పత్తి తూకంలో మోసం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. అనంతరం పలు పత్తి మిల్లులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఆర్డీవో రాజేష్‌కుమార్, తహసీల్దార్ రాంరెడ్డి, డీటీ హరీందర్‌రెడ్డి, సీసీఐ అధికారులు పాల్గొన్నారు.