బీజేపీ నాయకుల బైక్ ర్యాలీ
ABN , First Publish Date - 2020-12-06T04:00:54+05:30 IST
హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించినందుకు మం డల కేంద్రంలో బీజేపీ నాయకులు విజయోత్సవ బైక్ రాలీ నిర్వహించారు.
మిడ్జిల్, డిసెంబరు 5: హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించినందుకు మం డల కేంద్రంలో బీజేపీ నాయకులు విజయోత్సవ బైక్ రాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రాజేశ్వర్ మాట్లాడుతూ కుటుంబ నియం తృత్వ పాలనను ప్రజలు తుంగలో తొక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విష్ణు వర్ధన్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ శ్రీధర్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి తిరుపతి, నాయకులు రవిగౌడ్, వాసు దేవుకుమార్, లాలూ ముదిరాజ్, విష్ణు, ప్రభాకర్‌గౌడ్, శ్రీశైలం, సత్యనారాయణ, బాలస్వామి, శ్రీనివాస్, రామ కృష్ణ, నరేష్, మహేంద్రాచారి, చంద్రశేఖర్, అశోక్, అరవింద్, రాము, శేఖర్, బాబు, తేజ, చంటి, ఆంజనేయులు పాల్గొన్నారు.
బీజేపీ విజయోత్సవ సంబురాలు
కోయిలకొండ: బీజేపీ నాయకులు శనివారం మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో సం బురాలు జరుపుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నాలుగు సీట్ల నుంచి 48 సీట్లు గెలుచు కున్నామని పార్టీ మండల అధ్యక్షుడు మధుసూ దన్‌రెడ్డి అన్నారు. 2023 ఎన్నికల్లో బీజేపీ అధికా రంలోకి రావడం ఖాయమని అన్నారు. కార్యక్రమం లో వెంకట్‌రాంరెడ్డి,యాదిరెడ్డి కరుణాకర్‌రెడ్డి తదిత రులు పాల్గొన్నారు.
బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి..
అడ్డాకుల: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నిక ల్లో బీజేపీ 48 డివిజన్లు గెలుచుకోవడంతో శనివారం అడ్డాకుల మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు నిర్వహించారు. కార్యక్ర మంలో మండల బీజేపీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సూర్య నారాయణ, మూసాపేట మండల బీజేపీ అధ్యక్షు డు రవీందర్‌రెడ్డి, గట్టుమల్లేశ్, వెంకటేశ్, సురేందర్ రెడ్డి, కావలిరాజు, బాలకృష్ఱారెడ్డి, గంగుల రాజశేఖ ర్ రెడ్డి, రాకేశ్, తిరుపతినాయక్, రమేశ్ సాగర్, వడ్లశివ, శాఖాపూర్ రఘు, నరసింహగౌడ్, దాస్, రమేశ్, ప్రేమ్‌కుమార్, వీరేశ్, ఆస్కాని వినోద్, కావలి శివ, జె.రాజమౌళి, పి.రవి పాల్గొన్నారు.
2023లో బీజేపీ గెలుపు ఖాయం
దేవరకద్ర: వచ్చే 2023 ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కొండ అంజన్‌కుమార్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నిక ల్లో బీజేపీ కార్పొరేటర్ల గెలుపుతో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు తగ్గిన బుద్ధి చెప్పారని అన్నారు. గతంలో నాలుగు కార్పొరేటర్ల రాగా ఈ సారి ఎన్నికల్లో 48 మంది విజయం సాధించడంతో టీఆర్‌ఎస్ పార్టీకి గుండెల్లో గుబులు పుట్టిందని అన్నారు. పొలింగ్ వంద శాతం జరిగితే మొత్తం బీజేపీ కార్పొరేటర్ల ఘన విజయం సాధించేవారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో 2023లో బీజేపీ అధికారం లోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సాయిరాజ్, నారాయణరెడ్డి, శేఖర్, కృష్ణారెడ్డి, వెంక టేష్ పాల్గొన్నారు.
బీజేపీకి బ్రహ్మ రథం
నవాబ్‌పేట: గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని బీజేపీ మండల సీనియర్ నాయకుడు కొల్లి నర్సింహ అన్నారు. శనివారం మండల విలేఖ రులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని అందుకు దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలే నిదర్శనమన్నారు. దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కాబోయె ఎన్నిక ల్లో బీజేపీ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ తీసుకున్న తప్పుడు నిర్ణ యాలే తమ అభ్యర్థుల గెలుపునకు దోహదపడ్డా యని తెలిపారు.