బీజేపీలో చేరిన నంగి దేవేందర్‌ రెడ్డి

ABN , First Publish Date - 2020-11-27T03:43:53+05:30 IST

టీపీసీసీ అధికార ప్రతినిధి, ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌ నంగి దేవేందర్‌ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేందర్‌ ఫడ్నవీస్‌ సమక్షంలో బీజేపీలో చేరారు.

బీజేపీలో చేరిన నంగి దేవేందర్‌ రెడ్డి
హైదరాబాద్‌లో బీజేపీలో చేరుతున్న నంగి దేవేందర్‌ రెడ్డి

నారాయణపేట టౌన్‌, నవంబరు 26: టీపీసీసీ అధికార ప్రతినిధి, ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌ నంగి దేవేందర్‌ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేందర్‌ ఫడ్నవీస్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. ఇటీవల టీపీసీసీకి, ఎన్‌ఆర్‌ఐ కన్వీనర్‌కు రాజీనామా చేశారు. నంగి దేవేందర్‌రెడ్డి గల్ఫ్‌ వలస కార్మికుల సమస్యలపై  పోరాడారు.  మరికల్‌ మండలం జిన్నారం గ్రామానికి చెందిన దేవేందర్‌ రెడ్డి  రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీలో ఇమడలేక పోయారు.  బీజేపీకే దేశాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తిఉందనే ఉద్దేశ్యంతో ఆ పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-11-27T03:43:53+05:30 IST