-
-
Home » Telangana » Mahbubnagar » bharth bamd
-
భారత్ బంద్‌కు పూర్తి సహకారం అందిద్దాం
ABN , First Publish Date - 2020-12-07T04:25:57+05:30 IST
కేంద్ర ప్ర భుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన భారత్ బంద్‌కు అందరూ సహకరించాలని గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కోరారు.

అఖిల పక్ష సమావేశంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, డిసెంబరు 6 ( ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్ర భుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన భారత్ బంద్‌కు అందరూ సహకరించాలని గద్వాల ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కోరారు. ఆదివారం వాల్మీకి భవన్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. భారత్ బంద్‌కు టీ ఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.సీపీఐ, సీపీ ఎం నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, వెంకటస్వామి, ఆంజనేయులు, గోపాల్ పాల్గొన్నారు.