-
-
Home » Telangana » Mahbubnagar » bhakthia
-
భక్తుల పుణ్య స్నానాలు
ABN , First Publish Date - 2020-11-26T02:47:07+05:30 IST
వేణిసోమ్‌పూర్ పుష్కరఘాట్‌లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.

అయిజ, నవంబరు 25: వేణిసోమ్‌పూర్ పుష్కరఘాట్‌లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. స్నానాలు ఆచ రించి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కర ఘాట్‌కు పూజలు చేసి నదిలో దీపాలు వదిలారు. ఈ ఒక్కరోజే 2,700 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
పుల్లూరు ఘాట్‌కు పుష్కరశోభ
ఉండవల్లి: పుల్లూరు పుష్కరఘాట్ పుష్కర శోభ సంత రించుకుంది. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశిని పుర స్కరించుకుని వివిధ దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తు లు బుధవారం పుల్లూరు ఘాట్‌ను చేరుకుని పుష్కర స్నా నాలు ఆచరించి తుంగభద్రమ్మకు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. మహిళలు, యువతులు కార్తీక దీపాలను వెలి గించి నదిలో వదిలారు.
పుల్లూరు ఘాట్ వద్ద మాజీ ఎమ్మెల్యేల పూజలు
అలంపూర్ మాజీ ఎమ్మెల్యేలు చల్లా వెంకట్రామిరెడ్డి, సంపత్‌కుమార్‌లు పుష్కరఘాట్‌ను సందర్శించి నదీమతల్లి కి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని చెన్న కేశవ స్వామి, ఆంజనేయస్వామి ఆలయాలను దర్శించుకో గా అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
పుల్లూరులో నిరంతర అన్నదానం
ఉండవల్లి, నవంబరు 25: పుల్లూరు పుష్కరఘాట్‌లో నిరంతర అన్నదాన ప్రక్రియ కొనసాగుతోంది. నాలుగు ఘాట్‌లలో లేని విధంగా పుల్లూరు వచ్చే భక్తులకు నిరం తరం అన్నదాన ప్రక్రియ కొనసాగడం ప్రత్యేకతగా చెప్పవ చ్చు. సర్పంచు నారాయణమ్మ దాతల సహకారంతో నిత్యం పది వేల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నారు.
పుష్కర స్నానానికి పుష్కలంగా నీరు
రాజోలి, నవంబరు 25: తుంగభద్రలో నీరు పుష్కలంగా ఉండటంతో భక్తులు ఆనందంగా జలకాలాడుతున్నారు. కొవి డ్ ఉన్నందున పోలీస్ అధికారులు నీళ్లలో ఎక్కువసేపు ఉండకూడదని భక్తులను ఒడ్డుకు పంపేస్తున్నారు. పోలీసు అధికారులు పుష్కరఘాట్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు.
అధిక వసూళ్లపై భక్తుల ఫిర్యాదు
అలంపూర్, నవంబరు 25: పితృ దేవతలకు పిండ ప్రదా నాలను చేయడానికి పూజార్లు అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ రూ.300 నిర్దేశించగా రూ.1500 వరకు వసూలు చేస్తు న్నట్లు పలువురు పేర్కొన్నారు. బుధవారం పెద్ద ధన్వాడకు చెందిన భీముడు అనే వ్యక్తి పిండ ప్రదానం చేసేందుకు రాగా రూ.1500 వరకు వసూలు చేశారని దేవాదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అందుబాటులో రిష్క్యూ టీం
అలంపూర్/గద్వాల క్రైం, నవంబరు 25: తుంగభద్ర పుస్కరాలకు వచ్చే భక్తులకు రిస్క్యూ టీం సేవలు అందుబా టులో ఉన్నాయి. రిష్క్యూ టీం ఓఎస్‌డీ హరిశ్చంద్రపాండే బుధవారం అలంపూర్ తహసీల్దార్ మదన్‌మోహన్‌తో కలిసి తుంగభద్ర నదిలో పవర్‌బోట్ పర్యటించారు. భక్తులు నది లో స్నానమాచరించేటప్పుడు రిష్క్యూ టీం సిబ్బంది సూచనలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీ భూపాల్‌రెడ్డి ఉన్నారు.
ఏపీ భక్తులంతా ఇక్కడికే..
ఉండవల్లి, నవంబరు 25: తుంగభద్ర నది పుష్కరాలతో పుల్లూరు పుష్కరఘాట్ పక్కన ఉన్న తెలుగు రాష్ట్ర భక్తుల రాకతో పులకరిస్తోంది. పక్క రాష్ట్రంలో జల్లుల స్నానానికే మాత్రమే అనుమతి ఉండడంతో అక్కడి భక్తులు పుల్లూరు పుష్కరఘాట్‌లో స్నానాలు చేస్తున్నారు. పుష్కర స్నానంతో తమ జన్మ ధన్యమైందని కర్నూలు జిల్లాకు చెందిన కోటేశ్వర్‌రావు దంప తులు ఆనందం వ్యక్తం చేశారు.




