అనుమానిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-08-22T10:52:21+05:30 IST

మండలంలోని అల్లీపురం చెక్‌డ్యాం వద్ద యువకుడు సాయిరాం గౌడ్‌ గల్లంతై, దుర్మరణం చెందటం దురదృ ష్టకరమని, ఇలాంటి ప్రాంతాల్లో

అనుమానిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌


 చిన్నచింతకుంట, ఆగస్టు 21: మండలంలోని అల్లీపురం చెక్‌డ్యాం వద్ద యువకుడు సాయిరాం గౌడ్‌ గల్లంతై, దుర్మరణం చెందటం దురదృ ష్టకరమని, ఇలాంటి ప్రాంతాల్లో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. శుక్రవారం చిన్నచింత కుంట, మదనాపూర్‌ గ్రామాల మధ్య గల ఊక చెట్టువాగు ప్రాంతంలో బాధితుడి తల్లిదండ్రుల ను మంత్రితో పాటుగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మ న్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, జడ్పీచైర్‌ పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ రఘువర్ధన్‌ గౌడ్‌ పరామర్శించారు.


ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఊకచెట్టు వాగులో చెక్‌ డ్యాంలను చూసేందుకు వెళ్తుంటారని, జాగ్ర త్తలు పాటించకుంటే విషాదం నెలకొనే ప్రమాదం ఉంటుందన్నారు. చెక్‌డ్యాం వద్ద వీఆర్‌ఓలతో గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని, అవసరం అయితే గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈత రాని వారు చెక్‌డ్యాం వద్దకు వెళ్లొ ద్దన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వ పరం గా ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, వనపర్తి ఎస్పీ అపూర్వ రావు, ఆర్డీఓ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-22T10:52:21+05:30 IST