బీసీల అభివృద్ధే ధ్యేయం : సతీష్‌మాదిగ

ABN , First Publish Date - 2020-12-14T03:12:11+05:30 IST

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే డీఎస్‌ మాస్‌ ధ్యేయమని ఆ సంస్థ రాష్ట్ర చైర్మన్‌ దేవని సతీష్‌మాదగ అన్నారు.

బీసీల అభివృద్ధే  ధ్యేయం : సతీష్‌మాదిగ
శ్రీరంగాపురంలో దుకాణాన్ని ప్రారంభిస్తున్న సతీష్‌మాదిగ

ఇటిక్యాల/శ్రీరంగాపురం, డిసెంబరు 13: బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే డీఎస్‌ మాస్‌ ధ్యేయమని ఆ సంస్థ రాష్ట్ర చైర్మన్‌ దేవని సతీష్‌మాదగ అన్నారు.   ఇటిక్యాల, శ్రీరంగాపూర్‌ మండలాల్లోని  కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో చిరు వ్యాపారులను గుర్తించి, వారికి ఆర్థిక సాయం అందించేందుకు గాను సమస్థ పనిచేస్తుందన్నారు. ఈ నెల 15 నుంచి 20 తేదీ లోపల గ్రామాల్లో ఉన్న చిరు వ్యాపారులను గుర్తించి, వారికి ఆర్థిక సాయం అందించాలని తెలిపారు.  శ్రీరంగాపురంలో ఏర్పాటుచేసిన దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. సగ్గి ప్రకాష్‌, హిమానేలు, లాధర్‌, గోరంట్ల, ప్రభుదాస్‌, జడ్పీటీసీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌, ఎల్లస్వామి యాదవ్‌, మొల్గర మహేందర్‌, డీఎస్‌ మాస్‌ వనపర్తి ఇన్‌చార్జి,  రాములు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వాడ్యాల విజయ్‌కుమార్‌, బీసుపల్లి, బీమయ్య తదితరులు  పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T03:12:11+05:30 IST