-
-
Home » Telangana » Mahbubnagar » bank
-
మణప్పురం బ్యాంక్‌కు కన్నం వేసేందుకు విఫలయత్నం
ABN , First Publish Date - 2020-12-28T03:07:21+05:30 IST
దొంగలు బరితెగిస్తున్నారు.

మహబూబ్‌నగర్, డిసెంబరు 27: దొంగలు బరితెగిస్తున్నారు. మణప్పురం బ్యాంక్ ను దోచుకునేందుకు రెండో సారి కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. నెల రోజుల క్రితం పట్టణంలోని అశోక్‌టాకీస్ చౌరస్తాలో ఉన్న మణప్పురం బ్యాంక్‌ను దోచుకునేం దుకు పక్కన ఉన్న కార్యాలయానికి కన్నం వేసి దుండగులు లోనికి ప్రవేశించారు. కానీ లాకర్లు తెరువలేక వెనుదిరిగారు. శనివారం రాత్రి న్యూటౌన్‌లోని మణప్పురం బ్యాంకు లో చోరీ చేసేందుకు యత్నించిన దొంగలు పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. అర్ధ రాత్రి ఒంటి గంట సమయంలో ఆరుగురు వ్యక్తులు బ్యాంక్ షెటర్ తాళాలు తొల గించి లోపల ఉన్న చైన్‌గేట్‌ను గ్యాస్‌కట్టర్‌తో కట్ చేసేందుకు యత్నిస్తుండగా, సెక్యూ రిటీ గార్డ్ గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఆ సమయంలో డ్యూటీ లో ఉన్న టూటౌన్ సీఐ శ్రీనివాసచారి వెంటనే సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. చోరీ కి యత్నిస్తున్న ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరో ముగ్గురు పారిపోయా రు. వీరి కోసం గాలిస్తున్నారు. పాలమూరుకు చెందిన ముగ్గురు పట్టుబడా, జార్కం డ్‌కు చెందిన మరో ముగ్గురు పరారైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఎస్పీ రెమా రాజేశ్వరి మణప్పురం బ్యాంక్ వద్దకు చేరుకొని పరిశీలించారు. అయితే మణప్పు రంలో రెండు సార్లు చోరీకి యత్నిస్తున్న ముఠా ఒక్కటేనా, లేదా వేర్వేరు ముఠాలా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.