బంద్‌ పాటించిన హాస్పిటల్స్‌

ABN , First Publish Date - 2020-12-12T03:54:50+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసు కునేందుకు అనుమతిస్తూ జీవోను విడుదల చేయడంతో తక్షణమే దానిని ఉపసంహరించుకో వాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు శుక్రవారం ఓపీ సేవలు నిలిపివేసి బంద్‌ పాటించారు.

బంద్‌ పాటించిన హాస్పిటల్స్‌

కందనూలు, డిసెంబరు 11:  కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసు కునేందుకు అనుమతిస్తూ జీవోను విడుదల చేయడంతో తక్షణమే దానిని ఉపసంహరించుకో వాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు శుక్రవారం ఓపీ సేవలు నిలిపివేసి బంద్‌ పాటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అనితకేర్‌వేల్‌ ఆసుపత్రిలో డాక్టర్‌ చెన్నయ్య ఓపీ సేవలు నిలిపివేసి బంద్‌ పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా మెడిసి న్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌లో ప్రచురించిన ప్రకారం ఆయుర్వేద  డాక్టర్లకు 58రకాల ఆపరేషన్లు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులివ్వడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించా రు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బంద్‌ పాటించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచమంతటా 90శాతం పైబడి ప్రజలందరూ అల్లోపతి అనే మోడ్రన్‌ మెడిసిన్‌ ద్వారానే వైద్యాన్ని పాటిస్తున్నారని ఆయన అన్నారు.  ఆయుర్వేద డాక్టర్లు ఆపరేషన్లు చేయడానికి అనుమతిస్తే దేశ ప్రజలందరికీ తీవ్ర నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.  

Updated Date - 2020-12-12T03:54:50+05:30 IST