బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

ABN , First Publish Date - 2020-12-03T03:26:48+05:30 IST

బాల్యవివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని బాలల సంరక్షణ జిల్లా కోఆర్డినేటర్‌ హేమలత అన్నారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
సమావేశంలో మాట్లాడుతున్న బాలల సంరక్షణ జిల్లా కోఆర్డినేటర్‌ హేమలత

- బాలల సంరక్షణ జిల్లా కోఆర్డినేటర్‌ హేమలత

    మల్దకల్‌, డిసెంబరు 2: బాల్యవివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని బాలల సంరక్షణ జిల్లా కోఆర్డినేటర్‌ హేమలత అన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహనా సమావేశంలో ఆమె మాట్లాడారు. లైంగిక, వరకట్న వేధింపులకు పాల్పడితే 181 హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.  సీడీపీవో కమలాదేవి, మెడికల్‌ ఆఫీసర్‌ యమున, సఖికేంద్రం అధికారి జయలక్ష్మి, జ్ఞానేంద్రచారి, అంగన్‌వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


1098కు సమాచారం ఇవ్వాలి

    గట్టు: బాల్యవివాహలు చేయడం చట్టరీత్యా నేరమని గట్టు తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం అన్నారు. బాల్యవివాహాల నిర్మూలనపై ఎంబీఎఫ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ముద్రించిన వాల్‌పోస్టర్‌ను మండల కార్యాలయంలో బుధవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా బాల్యవివాహలు జరుగుతున్నట్లు తెలిస్తే 1098కు సమా చారమివ్వాలని కోరారు. ఎంవీఎఫ్‌ కోఅర్డినేటర్‌ క్రిష్ణ, అర్‌ఐ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-03T03:26:48+05:30 IST