భక్తిశ్రద్ధలతో శనీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2020-11-22T04:08:53+05:30 IST

జేష్టాదేవి సమేత సార్థసప్త శనీశ్వర స్వామికి భక్తిశ్రద్ధలతో భక్తు లు తిల తైల అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన పూజారి డాక్టర్‌ గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు.

భక్తిశ్రద్ధలతో శనీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

బిజినేపల్లి, నవంబరు 21: జేష్టాదేవి సమేత సార్థసప్త శనీశ్వర స్వామికి భక్తిశ్రద్ధలతో భక్తు లు తిల తైల అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన పూజారి డాక్టర్‌ గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. మండల పరిధిలోని నందివడ్డెమాన్‌లోని నందీశ్వరాల యం ఆవరణలోని శనీశ్వర స్వామికి శనివారం భక్తులు నల్లని వస్త్రాలు ధరించి నువ్వుల నూ నె, జిల్లేడు పూలు, నల్లని నువ్వులు, నల్లని వస్త్రంతో పూజలు ఘనంగా చేశారు. అనంతరం ఆలయ ఆవరణలోని నందీశ్వర పరమశివుని వివిధ రకాల పండ్ల రసాలు, బిల్వ పత్రాలతో అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి వసతి, అల్పాహారం ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ గోపాల్‌రావు తెలిపారు. కార్యక్రమంలో పూజారులు ఉమామహేశ్వరం, శాంతికుమార్‌, ఆలయ కమిటీ సభ్యులు ప్రభాకరాచారి, వీరశేఖర్‌, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more