-
-
Home » Telangana » Mahbubnagar » ayyappa
-
అయ్యప్ప స్వామికి అభిషేకం
ABN , First Publish Date - 2020-12-29T04:00:22+05:30 IST
మండల పరిధిలోని సంకలమద్ది గ్రామ అనుబంధ గ్రామమైన బంగ్ల గడ్డలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షుడు వెంకటస్వామి ఇంటి ఆవరణలో అయ్యప్ప భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పడి పూజ నిర్వహించారు.

బండ్లగడ్డలో మెట్ల పూజ
మూసాపేట, డిసెంబరు 28: మండల పరిధిలోని సంకలమద్ది గ్రామ అనుబంధ గ్రామమైన బంగ్ల గడ్డలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షుడు వెంకటస్వామి ఇంటి ఆవరణలో అయ్యప్ప భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పడి పూజ నిర్వహించారు. సంకల్పసిద్ది అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో గురుస్వామి కాశీనాథ్ సమక్షంలో ముందుగా గణపతి, కుమారస్వాముల పూజల అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అయ్యప్పస్వామి పాటలతో బంగ్ల గడ్డ మార్మోగింది. పద్దెనిమిది మెట్లపై కర్పూరం వెలిగించి మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలతోపాటు భక్తులకు అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు రాజు, లక్ష్మణ్, చెన్న కేశవులు, అయ్యప్ప సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
నేడు మహమ్మదాబాద్‌లో మహా పడిపూజ
గండీడ్: మహమ్మదాబాద్‌లోని కాంతిమల శిఖరపై ఉన్న అయ్యప్పస్వామి ఆలయంలో మంగళవా రం మహాపడి పూజ నిర్వహిస్తామని ఆలయ కమి టీ సభ్యులు తెలిపారు. ఉదయం 7గంటలకు శివాలయం నుంచి పల్లకి సేవ, కళశాలతో స్వామివారి శోభయాత్ర, 9గంటలకు గణపతి కూమారస్వాముల అలంకరణ మహోత్సవం, 10.30 గంటలకు అయ్యప్ప స్వామి మహాపడి పూజ, 12 గంటలకు స్వామివారి అభిషే కం, 1.00 గంటలకు ఏకశిల పదు నెట్టాంబడిపైన దీపారాధ న, 2.00 గంటలకు మంగంపేట్ తండా సర్పంచ్ గీతపాండు నాయక్ ఆధ్వర్యంలో అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వ హిస్తామని తెలిపారు.