ఆయుష్‌ డాక్టర్లతో శస్త్రచికిత్స వద్దు

ABN , First Publish Date - 2020-12-12T03:26:45+05:30 IST

ఆయుష్‌ డాక్టర్లకు శిక్షణ ఇచ్చి శస్త్రచికిత్స చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా. రాంమోహన్‌ డిమాండ్‌ చేశారు.

ఆయుష్‌ డాక్టర్లతో శస్త్రచికిత్స వద్దు
మాట్లాడుతున్న ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా. రాంమోహన్‌

కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలి : ఐఎంఏ


మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం) డిసెంబర్‌ 11: ఆయుష్‌ డాక్టర్లకు శిక్షణ ఇచ్చి శస్త్రచికిత్స చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా. రాంమోహన్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను బంద్‌ చేశారు. ఈ సంద ర్భంగా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఎదుట వైద్యులం తా నిరసన చేపట్టారు. అనంతరం రాంమోహన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆర్డినెన్స్‌ అల్లోపతి వైద్యాన్ని, వైద్యులను కించపరిచే విధంగా ఉందని, దీని వల్ల వైద్యులు తీవ్రంగా నష్ట పోయే ప్రమాదం ఉందన్నారు. అంతేగాకుండా 12 ఏళ్లు వైద్య విద్యను చదివి పరీక్షలు రాసి సీట్లు సంపా దించి వైద్య వృత్తిని చేపడితే కేవలం ఏడాదిలో శిక్షణ తీసుకొని ఆయుర్వేదిక్‌ వైద్యులు శస్త్ర చికిత్స చేస్తే ప్రజల ప్రాణాలకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, శస్త్రచికిత్స చేసేందు కు అల్లోపతి వైద్యం ఉందని, అంతేకాని హోమియో, ఆయుర్వేదిక్‌ వైద్యులు కూడా శస్త్రచికిత్స చేయడం వల్ల ఇన్నేళ్లు చదివిన వైద్య వృత్తికి విలువ లేకుండా పోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని ఉధృ తం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐఎం ఏ జిల్లా నాయకులు డా. సంపత్‌కుమార్‌, డా.అనిల్‌, డా. విజయకాంత్‌, డా. వినోద్‌, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.

ఓపీ సేవలు బంద్‌ విజయవంతం


కేంద్ర ప్రభుత్వం అల్లోపతి వైద్యులకు వ్యతిరేకంగా జారీ చేసిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకంగా ఐఎంఏ ఆధ్వ ర్యంలో జిల్లాలో ఓపీ సేవలు బంద్‌ చేశారు. శుక్రవా రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంట ల వరకు జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. జిల్లాలో జనరల్‌ ఆసుపత్రి, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలలో మాత్రమే ఈ సేవలు కొనసాగాయి. అయితే ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్‌ చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగలేవు. ముందస్తుగానే ఐఎంఏ నాయ కులు ప్రకటన విడుదల చేయడంతో అత్యవసరమైన వారు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లారు.

Updated Date - 2020-12-12T03:26:45+05:30 IST