కరోనాపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2020-07-28T11:06:19+05:30 IST

గ్రామీణ స్థాయిలో కరోనాపై మరింత అవగాహన కల్పించే బాధ్యత ఆర్‌ఎంపీ, పీఎంపీలదేనని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ

కరోనాపై అవగాహన కల్పించాలి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కృష్ణ


మహబూబ్‌నగర్‌ (వైద్య విభాగం) జూలై 27: గ్రామీణ స్థాయిలో కరోనాపై మరింత అవగాహన కల్పించే బాధ్యత ఆర్‌ఎంపీ, పీఎంపీలదేనని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. కృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్‌ సమావేశ మందిరంలో సోమవారం ఆర్‌ఎంపీ, పీఎంపీలకు కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న కోవిడ్‌-19 నియంత్రణలో ప్రజారోగ్యాన్ని సంరక్షించే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు గ్రామీణ వైద్యుల సేవలను వినియోగించు కుంటున్నామని తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధిత లక్షణాలతో గ్రామీణ వైద్యుల వద్దకు వస్తున్న వారికి కరోనాపై అవగాహన కల్పించాలని, అందులో ఎవరికైనా ప్రమాదకర లక్షణాలుంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్సు సహాయంతో పంపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా మాస్‌ మీడియా అధికారి డా. తిరుపతిరావు, 104 అంబులెన్సు సేవల సమన్వయకర్త వేణుగో పాల్‌రెడ్డి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ రాజగోపాలాచారి, జిల్లా గ్రామీణ వైద్య సేవకుల సంఘం అధ్యక్షుడు శ్రావణ్‌, గ్రామీణ వైద్య సేవకుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు వీవీ చారి, అధ్యక్షుడు ఉదయ్‌ భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-28T11:06:19+05:30 IST