డోలు విద్వాంసుడికి తెలంగాణ రత్న అవార్డు

ABN , First Publish Date - 2020-12-02T03:14:37+05:30 IST

జిల్లాకు చెందిన డోలు విద్వాంసులు ఎం. నాగరాజు (బెక్కెం రాజు)కు విశాఖ పట్టణానికి చెందిన అర్పిత సాంస్కృతిక, సామాజిక సేవాసంస్థ వారు తెలంగాణ రత్న అవార్డును ప్రదానం చేశారు.

డోలు విద్వాంసుడికి తెలంగాణ రత్న అవార్డు

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, డిసెంబరు 1: జిల్లాకు చెందిన డోలు విద్వాంసులు ఎం. నాగరాజు (బెక్కెం రాజు)కు విశాఖ పట్టణానికి చెందిన అర్పిత సాంస్కృతిక, సామాజిక సేవాసంస్థ వారు తెలంగాణ రత్న అవార్డును ప్రదానం చేశారు. ప్రతి యేటా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డును ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. నాగరాజు ప్రతిభను గుర్తించిన ఆ సేవా సంస్థ వారు 2020కి తెలంగాణ రత్న అవార్డుకు ఎంపికచేసి మంగళవారం విశాఖపట్నంలో అందించారు. నాగరాజుకు అవార్డు రావడం పట్ల  కళాకారులు హర్షం వ్యక్తంచేశారు.  

Updated Date - 2020-12-02T03:14:37+05:30 IST