అక్రమంగా మట్టి తరలింపు కథనంపై అధికారుల స్పందన

ABN , First Publish Date - 2020-11-06T10:38:24+05:30 IST

‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన ‘అక్రమంగా మట్టి తరలింపు’ అనే కథనంపై మండల రెవెన్యూ అధికారులు స్పందించారు.

అక్రమంగా మట్టి తరలింపు కథనంపై అధికారుల స్పందన

ఊర్కొండ, నవంబరు 5: ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన ‘అక్రమంగా మట్టి తరలింపు’ అనే కథనంపై మండల రెవెన్యూ అధికారులు స్పందించారు. జగబోయిన్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నంబరు 59లో సర్వేయర్‌, ఎంఆర్‌ఐలు కొలతలు వేశారు. కొలతల్లో ప్ర భుత్వ మిగులు భూమి ఎ.1-08 గుంటలు సైతం రైతులు ఆక్రమించుకొ ని మట్టి తీసిన ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు అధికారులు స్వంత భూమి లో మట్టి తీశారని పంచానామా ఇవ్వడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎ.1-08 గుంటలు మిగులు ఎక్కడంటూ గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. మండలంలోని జగబో యిన్‌పల్లి గ్రామ శివారులో ప్రభుత్వ భూమి నుంచి అక్రమంగా మట్టి తరలింపు కథనంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.  గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారు లో సర్వే నంబరు 59లో ఎ.27-01 గుంటల ప్రభుత్వ భూమి ఉంది.


అందులో రైతులకు పట్టా కాగా ప్రభుత్వ ఆధీనంలో ఎ1-08 గుంటలు మిగులు ఉంది. అక్కడే పక్క రైతులు ఎ.3-00 గల వారు ముందు చూపుతో ఎ 1-08 గుంటల భూమి స్వాధీనం చేసుకోవడానికి పథకం ప న్ని అందులో నుంచి మట్టిని తరలించడానికి ప్రైవేటు మిల్లు యాజమాన్యంతో కుమ్మక్కై య్యారు. మిగులు భూమిలో గత పదిహేను సంవత్సరాల క్రితం వాటర్‌ షెడ్డు ద్వారా చెక్‌ డ్యాం నిర్మాణం జరిగింది. చెక్‌డ్యాం పక్కనే మట్టి తరలించారు.


మట్టి తీయడంతో చెక్‌డ్యాం నాణ్యత కోల్పోవడంతో పాటు దాన్ని సైతం ధ్వంసం చేసే యోచనలో ఉన్నారు. మట్టి తీసే క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జిన్నింగ్‌ మిల్లు యాజమాన్యంతో కలిసి సుమారు పది లక్షలు చేతులు మారినా అధికారులు వారి చేతుల్లో కిలుబొమ్మలుగా మారి గ్రామాన్ని, ప్రభు త్వ భూమిని నష్ట పరుస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా జిన్నింగ్‌ మిల్లు యా జమాన్యం మట్టి తరలించడానికి ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2020-11-06T10:38:24+05:30 IST