ఆస్తుల వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి

ABN , First Publish Date - 2020-10-07T05:55:59+05:30 IST

ఆస్తుల వివరాలను ఆలైన్‌లో జాగ్రత్తగా నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ గ్రామ స్థాయి అధికారులకు సూచించారు.

ఆస్తుల వివరాలు జాగ్రత్తగా నమోదు చేయాలి

అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌

 

భూత్పూర్‌, అక్టోబరు 6: ఆస్తుల వివరాలను ఆలైన్‌లో జాగ్రత్తగా నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ గ్రామ స్థాయి అధికారులకు సూచించారు. మంగళవారం మండలంలోని పోతుల మడుగు, గోపన్నపల్లి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఆస్తుల వివరాల సేకరణ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటికి వెళ్లినప్పుడు ఎలాంటి వివరాలు సేకరిస్తు న్నారు?, ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేస్తున్నారు? అనే విషయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మితో మాట్లాడు తూ ఇబ్బందులు ఏర్పడితే వెంటనే ఉన్నతాధికారులను అడిగి తెలుసు కోవాలని చెప్పారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్‌ కమలమ్మ ఉన్నారు.

Read more