అడుక్కోనైనా నిధులు తెస్తా

ABN , First Publish Date - 2020-12-12T03:28:49+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడుక్కోనైనా పాలమూరు అభివృద్ధికి నిధులు తెస్తానని ఎక్సైజ్‌, క్రీడలు పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

అడుక్కోనైనా నిధులు తెస్తా
జిమ్‌ను ప్రారంభించి వ్యాయామం చేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 


మహబూబ్‌నగర్‌, విద్యా విభాగం డిసెంబరు 11: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడుక్కోనైనా పాలమూరు అభివృద్ధికి నిధులు తెస్తానని ఎక్సైజ్‌, క్రీడలు పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవా రం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్‌ కళాశాల మైదానంలోని క్రీడా ప్రాంగణంలో ఓపెన్‌ జిమ్‌, ఎయి ర్‌ జిమ్‌, మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేడీస్‌ జిమ్‌, యోగా సెంటర్‌లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఎకో పార్క్‌ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజల ఆర్యోగ్యం కోసం జిల్లా కేంద్రంతోపాటు పలు ప్రాంతాల్లో పార్కులు, ఆట స్థలాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాలమూరు అభివృద్ధి చెందుతోందని, ప్రతి ఒక్కరూ పాలమూరు వైపు చూస్తున్నారని అన్నారు. మహబూబ్‌నగర్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండటంతో పట్టణ సంపద పెరిగి పోయిందన్నారు. జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే కులం, మతం అనే భావన లేకుండా కలిసిమెలిసి మెలగాలని సూచించారు. క్రీడాభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించను న్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగా, వ్యాయామం చేయాలని, దీంతో రుగ్మతలను దూరం చేసుకోవచ్చని అన్నారు. ప్రతి ఒక్కరికీ తమకు తోచినంత సహాయం చేయాలని అన్నారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే వారే నిజమైన ప్రజాప్రతినిధి అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సి ములు, వైస్‌ చైర్మన్‌ తాటి గణేష్‌, వార్డు కౌన్సిలర్లు, నాయకులు కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T03:28:49+05:30 IST