భర్తను చంపిన భార్య అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-07-10T11:40:49+05:30 IST

భర్తను చంపిన భార్యను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మండలంలోని బోయలగుడ్డానికి చెందిన దేవరపు జమ్మన్నను అతడి భార్య శంకరమ్మ

భర్తను చంపిన భార్య అరెస్ట్‌

గట్టు జూలై 9 : భర్తను చంపిన భార్యను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మండలంలోని బోయలగుడ్డానికి చెందిన దేవరపు జమ్మన్నను అతడి భార్య శంకరమ్మ, అక్క కిష్టమ్మతో కలిసి మంగళవారం రాత్రి చంపేసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న ఆమె గ్రామంలోనే ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. మరో నిందితురాలు కిష్టమ్మ పరారీలో ఉందని సీఐ జక్కల హనుమంతు, ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. హతుడి సోదరుడు దేవర వుశేని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో కానిస్టేబుళ్లు ప్రేమ్‌కోఠి, గజేందర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-07-10T11:40:49+05:30 IST