మూగబోయున గువ్వనికుంట తండా

ABN , First Publish Date - 2020-12-28T03:31:31+05:30 IST

ఆర్మీ జవాన్‌ పరశురాం నాయక్‌ (32) మృతితో మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలంలోని గువ్వనికుంట తండా విషాదంలో మునిగిపోయింది.

మూగబోయున గువ్వనికుంట తండా
పరశురాం భౌతికకాయం వద్ద రోదిస్తున్న భార్య శాంతిబాయి

- ఆర్మీ జవాన్‌ పరశురాంకు కన్నీటి విడ్కోలు

- అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు 

- శవ పేటికను మోసిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి


గండీడ్‌, డిసెంబరు 27 : ఆర్మీ జవాన్‌ పరశురాం నాయక్‌ (32) మృతితో మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలంలోని గువ్వనికుంట తండా విషాదంలో మునిగిపోయింది. తండాకు చెందిన పరశురాం ఆర్మీ జవాన్‌గా జమ్మూకశ్మీర్‌ సరిహద్దులోని లద్దాఖ్‌లో విధులు నిర్వహిస్తూ, ఈ నెల 24న మృతి చెందా డు. శనివారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయానికి ఆయన భౌతికకాయాన్ని తీసుకురాగా, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీని వాస్‌గౌడ్‌, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి నివాళ్లు అర్పించారు. అక్కడి నుంచి భౌతికకాయాన్ని మోకర్లబాద్‌ మీదుగా తండాకు తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం జవాన్‌ ఇంటి నుంచి ఆయన వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర నిర్వ హించగా, ప్రజలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ఎమ్మెల్యే జ వాన్‌ శవపేటికను మోసి, ట్రాక్టర్‌ను నడిపారు. అనంతరం అ ధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు పరశురాం భౌతికకాయం వద్ద తల్లి కమ్లీబాయి, భార్య శాంతిబాయి, కూతురు భార్గవి, కుమారుడు కునాల్‌చౌహాన్‌ గౌవర వందం చేసి, అంతిమ వీడ్కోలు పలికారు. పిల్లలు జై జవాన్‌ అంటూ నినాదాలు చేసి జాతీయ జెండాను ఊపారు. 


ప్రభుత్వం అండగా ఉంటుంది

అమర జవాన్‌ పరశురాం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ప్రభుత్వం నుంచి రూ.25 లక్షలతో పాటు హైదరాబా ద్‌లో డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, పిల్లల చదువుకు సాయం అందిస్తామన్నారు. ఎమ్మెల్యే కె.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ గిరిజన సంఘాల నాయకుల కోరిక మేరకు పర శురాం విగ్రహాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.

అంత్యక్రియల్లో జిల్లా అదనపు కలెక్టర్‌ సీతారామరావ్‌, గం డీడ్‌ తహసీల్దార్‌ జ్యోతి, ఆర్‌ఐ శ్రీనివాస్‌, తెలంగాణ విద్యా మౌలిక వసతుల చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, వికారాబాద్‌ జిల్లా బీ జేపీ అధ్యక్షుడు ప్రహ్లాద్‌రావు, కార్యదర్శి వెంకటయ్యగౌడ్‌, నా యకులు రాములు, గిరమోని శ్రీనివాస్‌, కమతం రాజేందర్‌రె డ్డి, ఎంపీపీలు మాధవిరాజ్‌కూమార్‌రెడ్డి, సత్యహరిచందర్‌నా యక్‌, జడ్పీటిసీలు శ్రీనివాస్‌రెడ్డి, రాందాస్‌నాయక్‌, తెలంగాణ గిరిజన ఉద్యోగ సంఘాల నాయకులు రాంచదర్‌నాయక్‌, హ రించందర్‌నాయక్‌, అంగూర్‌నాయక్‌, టిపీసీసీ కార్యదర్శి, రా ములు, రిటైర్డు ఆర్మీ జవాన్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T03:31:31+05:30 IST