-
-
Home » Telangana » Mahbubnagar » anumathula
-
అనుమతుల ముసుగులో అక్రమాలు
ABN , First Publish Date - 2020-12-11T03:41:57+05:30 IST
సాగునీటి ప్రాజెక్టులకు, గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇస్తున్న అనుమతుల ముసు గులో ఇసుక అక్రమ మార్గం పడుతున్నది.

- దుందుభీ వాగు నుంచి జోరుగా ఇసుక తరలింపు
వంగూరు, డిసెంబరు 9: సాగునీటి ప్రాజెక్టులకు, గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఇస్తున్న అనుమతుల ముసు గులో ఇసుక అక్రమ మార్గం పడుతున్నది. క్యూబిక్ మీటర్ ఇసుకను చాలా తక్కువ ధరకు ఇస్తుండటంతో ఇసుక మాఫి యా దీనిపై కన్నేసింది. రెవిన్యూ, మైనింగ్ అధికారులకు మా మూళ్లు ఇచ్చి ఆ ఇసుకను కల్వకుర్తి, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు టిప్పర్లు, ట్రాక్టర్లలో అక్రమంగా రవాణ చేస్తూ లక్షలు అర్జిస్తున్నారు.
ప్రభుత్వ పనుల పేరుతో పక్కదారి
వంగూరు మండలంలోని డిండిచింతల్లి, మిట్టసదగోడు గ్రా మాల్లోని దుందుభీ వాగులో రీచ్‌కు ప్రభుత్వం ఇసుక తరలిం చేలా అనుమతులు ఇచ్చింది. కేఎల్‌ఐ కల్వర్టు పనులకు, కల్వ కుర్తిలోని సీసీ రోడ్లు వంటి అభివృద్ధి పనులకు వాగులో ఉన్న ఇసుకను తరలించాల్సి ఉంది. ఆర్‌ఐలు, వీఆర్ వోలు క్వారీల వద్ద ఉండి టిప్పర్, ట్రాక్టర్ల నెంబ ర్లతో సహా జారీ చేసిన పనులను చూసి టిప్పర్ల ను, ట్రాక్టర్లను బయటకు పంపించాల్సి ఉం టుంది. ఆయా టిప్పర్లు నిర్ణీత ప్రమాణంగానే ఇసుక రవాణా అవుతున్నదా పక్కదారి పడుతున్నదా అన్న అంశాలను మైనింగ్ అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. ఇసు క అక్రమ రవాణా దారులు మైనింగ్, రెవె న్యూ అధికారులకు మామూళ్లు ఇచ్చి దర్జాగా ఇసుకను కల్వకుర్తి, హైదరాబాద్‌కు తరలిస్తు న్నారు. వాగు నుంచి రోజూ దాదాపు 10 టిప్పర్లు, 50 ట్రాక్టర్లలో ఇసును తరలిస్తున్నారు. దీంతో 100 నుంచి 200 ట్రిప్పుల ఇసుకను దగ్గరలోని ప్రాంతాల్లో డంపు చేసి అక్కడి నంచి వేర్వేరు పాంతాలకు తరలిస్తు న్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక రూ. 5 వేల నుంచి 7 వేలు, ఒక టిప్పర్ 40 వేల నుంచి 50 వేల వరకు పలుకుతోంది. ఈ ఇసుకను కల్వకుర్తి, అచ్చం పేట, హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సంబంధిత రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు చర్యలు తీ సుకోవడం లేదు. ఎందుకంటే వారికి టిప్పర్, ట్రా క్టర్‌కి కొంత మొత్తం తీసుకొని ఈ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలు న్నాయి. నిత్యం ఇసుక భారీగా తరలి పోతుండ టంతో భూగర్భజలాలు అడుగంటే ప్రమాదం ఉందని ఆయా గ్రామాల రైతులు వాపో తున్నారు.
తనిఖీలు నిర్వహిస్తాం
డిండిచింతపల్లి, మిట్టసదగోడు రీచ్‌లో ఇసుక రవాణాపై తనిఖీలు చేసి చర్యలు చేపడుతాం. నిబంధనల ను అతిక్రమిస్తే చర్యలు తప్పవు. ఈ రీచ్‌లో పూర్తి స్తాయిలో నిఘా ఉంచి అక్రమాలు జరుగకుండా దృష్టి సాధిస్తాం.
- రాజునాయక్, తహసీల్దార్