అన్నా.. బండి మనదే.. జర చూసుకో..!
ABN , First Publish Date - 2020-12-14T02:36:54+05:30 IST
ముందు కారు.. వెనకా ల ఇసుక ట్రాక్టర్.. ఎక్కడైనా ఎవరైనా పోలీసులు, అధికారులు ఎదురు పడితే కారులో ఉన్న వ్యక్తులు కవర్ చేసేస్తారు.

ఇదీ ఇసుక వ్యాపారుల తంతు
అక్రమంగా తరలిపోతున్న ఇసుక
రాత్రి వేళల్లో ఇసుక మాఫియా దందా
నవాబ్‌పేట, డిసెంబరు 13: ముందు కారు.. వెనకా ల ఇసుక ట్రాక్టర్.. ఎక్కడైనా ఎవరైనా పోలీసులు, అధికారులు ఎదురు పడితే కారులో ఉన్న వ్యక్తులు కవర్ చేసేస్తారు. ‘అన్నా వెనకాల వచ్చేది మన బండే.. జర చూసుకో..’ అని చెప్పేస్తారు. అంతే అను కున్న గమ్యానికి ఆ ట్రాక్టర్ ఎలాంటి ఇబ్బంది లేకుం డా వెళ్లిపోతుంది నవాబ్‌పేట మండలంలో నిత్యం జరుగుతున్న తంతు ఇది. ఇక్కడ ఇసుక రవాణకు అడ్డు అదుపులేకుండా పోయింది. ఇసుక మాఫియా రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక తరలిస్తుండటంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. గ్రామాల్లో వారు నిర్ణయించిన రేట్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరైనా రైతులు ఎదిరిస్తే తనకు దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరింపులకు దిగుతున్నారు. అన్ని రంగాల్లో వెనుకబ డ్డ నవాబ్‌పేట మండలం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెం దుతోంది. దీంతో మండల కేంద్రంతోపా టు వివిధ గ్రామాల్లో గృహ నిర్మాణాలు, ఇతర భవన నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీంతో ఇసుక అవస రం పెరిగింది. దీనికితోడు ఈ సారి వర్షాలు సమృద్ధి గా కురవడంతో మండలంలోని లోకిరేవు, చౌటపల్లి, గోవోనిపల్లి, ఇప్పటూర్, కారూర్ తదితర గ్రామాల వెంట ఉన్న మీనంబరం వాగు నుంచి ఇసుక తీస్తూ ఇసుక వ్యాపారులు సొమ్ము చేసుకుం టున్నారు. మండలంలోని కారూర్, ఇప్పటూర్, లోకిరేవ్ గ్రామాల నుంచి నిత్యం టిప్పర్ల ద్వారా జడ్చర్ల, నవాబ్‌పేట, కొందూర్గు, మహబూబ్‌నగర్, బాలానగర్ తదితర ప్రాంతాలకు ఇసుక తరలిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. రాత్రి వేళల్లో అధికా రుల కళ్లుగప్పి ఇసుక విక్రయాలు సాగిస్తున్నట్లు తెలు స్తోంది. వాగు నుంచి ఇసుక టిప్పర్ బయలుదేరినప్పు డు ముందు వ్యాపారులు కారుతో బయలుదేరతారు. ఎవరైనా అడ్డు వస్తే ‘అన్నా.. వెనుక వచ్చేది మన బం డే జర చూసుకో’ అని చెబుతారు. ఆ తర్వాత అనుకు న్న ప్రాంతానికి చేర్చి రెట్టింపు రేటుకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.