నిజాయితీని చాటుకున్న డ్రైవర్‌

ABN , First Publish Date - 2020-06-06T10:13:12+05:30 IST

తనకు దొరికిన నగదును పోలీసులకు అప్పగించి ఓ డ్రైవర్‌ తన నిజాయితీని చాటుకున్నాడు. మండలంలోని ఎర్రవల్లి

నిజాయితీని చాటుకున్న డ్రైవర్‌

ఇటిక్యాల, జూన్‌ 5: తనకు దొరికిన నగదును పోలీసులకు అప్పగించి ఓ డ్రైవర్‌ తన నిజాయితీని చాటుకున్నాడు. మండలంలోని ఎర్రవల్లి చౌరస్తాలో శుక్రవారం ఆటోలు నిలిచే చోట గుర్తు తెలియని ప్రయాణికుడికి చెందిన రూ.5,050 నగదు డ్రైవర్‌ నరేశ్‌రెడ్డికి దొరకగా, ఆ నగదును తోటి డ్రైవర్లతో కలిసి ఎస్‌ఐ రాజుకు అందజేశాడు. నరేశ్‌రెడ్డితో పాటు మితగా డ్రైవర్లు శ్రీనివాసరెడ్డి, బల్గరి ఉపేంద్రబాబు, చంద్రశేఖర్‌, అదాం, తిమ్మనాయుడు, సర్వేగౌడ్‌ను ఎస్‌ఐ అభినందించారు.

Updated Date - 2020-06-06T10:13:12+05:30 IST