అంబేద్కర్‌ విగ్రహాలకు రక్షణ కల్పించాలి

ABN , First Publish Date - 2020-03-15T12:47:56+05:30 IST

దేశంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు రక్షణ కల్పించాలని సర్వజన మేధావి జెట్టిధర్మరాజు డిమాండ్‌ చేశారు. జిల్లా

అంబేద్కర్‌ విగ్రహాలకు రక్షణ కల్పించాలి

కందనూలు, మార్చి 14 : దేశంలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాలకు రక్షణ కల్పించాలని సర్వజన మేధావి జెట్టిధర్మరాజు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేసినందుకు నిరసనగా అంబేద్కర్‌ చౌరస్తాలో సర్వజన మేధావుల వర్గం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ప్రతిష్టించిన భారత రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం చేయడమంటే సర్వజనుల మనోభావాలను గాయపర్చినట్లేనని ఆయన ఆపేక్షించారు.


నడిరోడ్డుపై గల విగ్రహం ధ్వంసమైందంటే యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టోచ్చినట్లు కనబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ చూపుడు వేలుతో భారతదేశానికి పరిపాలనా విధానాన్ని, సమన్యాయం, భారతీయ ఐక్యతకు నిదర్శనంగా ఉన్న చూపుడు వేలును ధ్వంసం చేయడం అంటే ఈ దేశ మార్గనిర్దేశకత్వం ధ్వంసం చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే దేశంలో ఉన్న అంబేద్కర్‌ విగ్రహాలకు రక్షణ కల్పించి, విగ్రహాల దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దుండగులను అరెస్టు చేసి వెంటనే శిక్షించాలని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో దళిత బహుజనులు, అన్ని ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-15T12:47:56+05:30 IST