-
-
Home » Telangana » Mahbubnagar » ambedkar
-
ఘనంగా అంబేడ్కర్ వర్ధంతి
ABN , First Publish Date - 2020-12-07T03:35:29+05:30 IST
బహుజన భాస్కరుడు డా.బీఆర్ అంబేడ్కర్ అని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

పాలమూరు, బాదేపల్లి/బాలానగర్/నవాబ్ పేట/ మిడ్జిల్/గండీడ్/ భగీరథ కాలనీ, డిసెంబరు 6: బహుజన భాస్కరుడు డా.బీఆర్ అంబేడ్కర్ అని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మంత్రి తన అధి కార నివాసంలో అంబేడ్కర్‌కు నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సమాజంలోని నిమ్నజాతి వర్గాలకు రాజ్యాధికారాన్ని చేరువ చేసే దిశగా వైపు అంబేడ్కర్ రాజ్యాంగ రచన చేసినట్లు వివరించారు. ఆంబేడ్కర్ కృషి వల్లే నేడు అణగారిన వర్గాలు ఆత్మ గౌరవంతో జీవిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ నాయక త్వంలో తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తోందన్నారు.
- అంబేడ్కర్ జాతర ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాయికంటి రాందాసు ఆధ్వర్యంలో పట్టణంలోని పాత తోటలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం నీటి యూనిఫామ్స్ ధరించి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మార్పీఎ స్-టీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లెపోగు శ్రీనివాస్, జాతీయ మాలల ఐక్యవేదిక అధ్యక్షుడు దూమర్ల నిరంజన్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కావలి క్రిష్ణ య్య, పూలే అంబేడ్కర్ జాతర కమిటీ ఆధ్వర్యంలో, మాదిగ జన చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎ.నాగ రాజు ఆధ్వర్యంలో, మాలల ఉద్యోగుల సంఘం రమా కాంత్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎం.కుర్మయ్య, తెలం గాణ ఎరుకల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పి.క్రిష్ణ య్య, మాదాసి కురువ, మాదారి కురువ డి.రాములు ఆధ్వర్యంలో, వామపక్షపార్టీల ఆధ్వర్యంలో, మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో అంబేడ్క ర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.
- సామాజిక విప్లవ మహోపాధ్యాయుడు అంబే డ్కర్ అని తెలంగాణ నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. ఆదివారం జడ్చర్ల పట్టణంలోని సిగ్నల్ గడ్డలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపి అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు అంబేడ్కర్ అని అన్నారు. చర్మకారుల సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అలాగే మన సేవా సమితి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, సింగిల్ విడో చైర్మన్ సుదర్శన్ గౌడ్, నాయకులు రేణుక, ఇమ్ము, శంకర్‌నాయక్, ప్రణీల్ చందర్, ప్రశాంత్‌రెడ్డి, రమేష్, శ్రీనివాస్‌యాదవ్, రఘుపతిరెడ్డి, కృష్ణయ్య, రాజు, ఆంజనేయులు, వెంకటయ్య, బాషా, భాను పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో..
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే వివిధ కుల సంఘాల అధ్వర్యంలో నివాళులు అర్పిం చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఎడ్ల బాలవర్దన్‌గౌడ్. నాయకులు కృష్ణయాదవ్, రాఘవేందర్, జాహీంగీర్‌పాషాలు పాల్గొన్నారు.
- బాలానగర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వ హించారు. కొందరు గ్రామాల్లో అంబేడ్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్ర మంలో నాయకులు వెంకటాచారి, లక్ష్మణ్ నాయక్, బెపాల్, నందారం వెంకయ్య పాల్గొన్నారు.
- నవాబ్‌పేట మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి సర్పంచ్ గోపాల్‌గౌడ్, కొల్లూర్ ఎంపీటీసీ తులసిరాం, కొల్లూర్ రాజు, పండ్ల నర్సింహులు నివాళ్లి అర్పించారు. యన్మనగండ్లలో ఆదివారం గ్రామ పంచా యతీ కార్యాలయం వద్ద అంబేడ్కర్ చిత్రపటానికి స్థానిక యువకులు గురుకుల ఉద్యోగి విష్ణు, శేఖర్, డీలర్ గోపాల్, జనార్దన్ తదితరులు నివాళి అర్పించా రు. కొండాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ యాద య్య, ఎమ్మార్పీఎస్ నాయకులు శాంతయ్య, కోస్గి శం కర్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మండల నాయకులు కొల్లి నర్సింహ, ప్రకాశ్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
- మిడ్జిల్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి ఆదివారం బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాలులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి రాజేశ్వర్, ఎంపీపీ కాంతమ్మ, ఎమ్మార్పీఎస్ మం డల అధ్యక్షుడు సురేష్, వెంకట్‌రెడ్డి, గోపాల్, తిరుపతి, విష్ణు, వెంకట్, కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.
- గండీడ్ మండలంలోని ఆయా గ్రామాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. మహమ్మదాబాద్, గాధిర్యాల్, నంచర్ల, సల్కర్‌పేట్, రుసుంపల్లి, మంగంపేట్, పగిడ్యాల్, కొంరెడ్డిపల్లి, వెన్నాచెడ్, పెద్దవార్వాల్, చౌదర్‌పల్లి, కొండాపూర్, గండీడ్ తదితర గ్రామాల్లో ఆయన విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇ.రాములు. ఎస్‌ఐ నాగరాజు. సర్పంచ్‌లు శ్రీనివాస్, జితేందర్‌రెడ్డి, చంద్రకళ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం.నారా యణ, మాజీ ఎంపీపీ శాంతిరాగ్యా, అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణయ్య, మాలల సంఘాల నాయకులు పతి గోపాల్, ఆర్ జనార్దన్, ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు అనంతయ్య గుప్త పాల్గొన్నారు.
- హన్వాడ మండలంలో ఆదివారం అంబేడ్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కొత్తపేట్‌లో సర్పంచ్ చెన్నమ్మ, ఎంపీటీసీ అరుణ్, నాయకులు అం జిలయ్య, చెన్నయ్య, దస్తయ్య, రాములు, శ్రీనివాసులు అంబేడ్కర్ విగ్రహానికి పులమాలలు వేసి నివాళి అర్పించారు. చిన్నదర్పల్లిలో కౌన్సిలర్ లత, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి బాలరాజు, చెన్నకేశవులు, ఆశన్న, యాదగిరి తదితరులు పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమలలు వేసి నివాళి అర్పించారు. గుడిమల్కాపూ ర్‌లో సర్పంచ్ బాలగౌడ్, ఎంపీటీసీ మల్కయ్య, నాయ కులు వెంకట్‌రెడ్డి, చెన్నారెడ్డి తదతరులు అంబేడ్కర్ వర్ధంతిని నిర్వహించారు.
- బీజేపీ జిల్లా కార్యాలయంలో దళితమోర్చా ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్ధతిని ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్ అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంతకు ముందు దళిత మోర్చా నాయకులు పార్టీ కార్యాలయం నుంచి నుంచి అంబేడ్కర్ చౌరస్తాకు వెళ్లి అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొండయ్య, జిల్లా ఉపాధ్యక్షు డు ఎడ్ల కృష్ణయ్య, శ్రీరాము, మిట్టమిది నాగరాజు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వీరబ్రహ్మాచారి, ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
