-
-
Home » Telangana » Mahbubnagar » ambedka
-
అంబేడ్కర్ ఆశయాలను సాధించాలి
ABN , First Publish Date - 2020-12-07T04:15:00+05:30 IST
అంబే డ్కర్ ఆశయాలను సాధించిన నాడే దివంగత నేత కు నిజమైన నివాళి ఇచ్చినవారమవుతామని జడ్పీ చైర్‌పర్సన్ సరిత అన్నారు.

జడ్పీ చైర్‌పర్సన్ సరిత
అంబేడ్కర్ విగ్రహానికి నివాళి
క్యాంపు కార్యాలయంలో
ఎమ్మెల్యే అబ్రహాం నివాళి
గద్వాలటౌన్/క్రైం/రూరల్/కేటీదొడ్డి/అలంపూర్/చౌరస్తా/వడ్డేపల్లి/ఇటిక్యాల, డిసెంబరు 6: అంబే డ్కర్ ఆశయాలను సాధించిన నాడే దివంగత నేత కు నిజమైన నివాళి ఇచ్చినవారమవుతామని జడ్పీ చైర్‌పర్సన్ సరిత అన్నారు. ఆదివారం పట్టణంలో అంబేడ్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ జా గృతి నాయకులు వెంగల్ రెడ్డి, మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే వ్య వసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రామేశ్వర మ్మ, ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, కౌన్సిలర్లు మురళి, శం కర్, ఇసాక్, బంగి ప్రియాంక, నడిగడ్డ రైతు హ క్కుల పోరాట సమితి చైర్మన్ రంజిత్‌కుమార్, మాలఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బంగి రంగారావు, దివంగత నాయకుడికి నివాళి అర్పిం చారు. బీరెల్లి గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి జ డ్పీ వైస్ చైర్‌పర్సన్ సరోజమ్మ పూల మాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో గ్రామ స ర్పం చ్ జయమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు రాధమ్మ, ఎ మ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. కేటీదొడ్డి మండలం పాతపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరై అంబేడ్క ర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ సూర్యప్రకాష్, జ డ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్, టీఆర్‌ఎస్వీ జిల్లా కో- ఆర్డినేటర్ పల్లయ్య, నాయకులు, కార్యకర్తలు ఉ న్నారు. అలంపూర్ మునిసిపల్ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి మేనేజర్ జయప్రసాద్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి మాలమహానాడు, ఎమ్మార్పీఎస్, సీపీఎం, సీపీఐ, వివేకానంద యూత్, టీఆర్‌ఎస్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. శాంతినగర్ లో అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్‌నాయకులు కొంకల భీమ న్న పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ కరు ణ, జడ్పీటీసీ సభ్యుడు రాజు, డీటీఎఫ్, ఎమ్మార్పీ ఎస్ నాయకులు పాల్గొన్నారు. అలంపూర్‌చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే అబ్రహాం పూల మాలవేశారు. బొంకూరులో సర్పంచ్ శ్రీలత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఇటిక్యా లలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అం బేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఎస్పీ నాయకులు బీసన్న, సునీల్‌బాబు, విజయ్, బుచ్చన్న పాల్గొన్నారు.