ఇంటికొచ్చిన ‘సాఫ్ట్‌వేర్‌’

ABN , First Publish Date - 2020-09-13T09:09:41+05:30 IST

గ్రామీణ ప్రాంతాలు సందడిగా మారాయి. దశాబ్దాల కిందట ఊళ్లను వదిలి వెళ్లిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులంతా కరోనా ..

ఇంటికొచ్చిన  ‘సాఫ్ట్‌వేర్‌’

కరోనా వ్యాప్తితో వర్క్‌ ఫ్రం హోం ఆఫర్లు ఇచ్చిన కంపెనీలు

ఏళ్ల తరువాత సొంతుళ్లకు చేరుకున్న టేకీలు

అమ్మ చేతి వంటలను ఆస్వాదిస్తున్న ఉద్యోగులు

టెన్షన్‌ జీవితం నుంచి రిలాక్స్‌ అవుతున్న ఇంజనీర్లు


మహబూబ్‌నగర్‌ (విద్యావిభాగం), సెప్టెంబరు 12 : గ్రామీణ ప్రాంతాలు సందడిగా మారాయి. దశాబ్దాల కిందట ఊళ్లను వదిలి వెళ్లిన  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులంతా కరోనా ఎఫెక్ట్‌తో తిరిగి రావడంతో ఇప్పుడు కళకళలాడుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి కారణంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం ఆఫర్లు ఇవ్వడంతో, సాఫ్ట్‌వేర్‌ రంగం మహానగరాల నుంచి పట్టణాలు, పల్లెలకు వచ్చినట్లైంది.


క్షణం తీరిక లేకుండా నిత్యం వర్క్‌ టెన్షన్‌తో టేకీలు ఇబ్బందులు పడేవారు. మహానగరాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు పడుతూనే ఉద్యోగాలకు వెళ్లే వారు. పగలు, రాత్రి తేడా లేకుండా షిఫ్ట్‌ పద్ధతుల్లో విధులు నిర్వహించే వారు. కంపెనీలు ఇచ్చే టార్గెట్‌ను పూర్తి చేసేందుకు నిద్రహారాలు మాని అలిసిపోయేవారు. అయితే, కరోనా ప్రభావంతో కంపెనీలు వర్క్‌ ఫ్రం హోం ఇవ్వడంతో అందరూ సొంతూళ్ల బాట పట్టారు. తమకు కేటాయించిన షిఫ్టుల్లో ఇంటి వద్ద నుంచే పనులు చేస్తున్నారు. మధ్యలో ఒక గంట లంచ్‌ బ్రేక్‌ కలుపుకొని ప్రతి రోజూ 9 గంటలు పాటు విధులు నిర్వహిస్తున్నారు. అమ్మ చేతి వంటలను రూచి చూస్తూ, కడుపు నిండా భోజనం చేసి, కంటి నిండా నిద్రపోతున్నారు.


క్షణం తీరిక లేకుండా గడిపిన వారుతి ఇప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తున్నారు. కార్యాలయాల్లో పని చేస్తున్న విధంగానే కంపెనీలు ఇచ్చిన టార్గెట్లను ప్లానింగ్‌ ప్రకారం పూర్తి చేస్తున్నారు. కంపెనీలతో లాగిన్‌ అయ్యేందుకు ఇళ్లలోనే ప్రత్యేకంగా ఇంటర్నెట్‌ సౌకర్యం ఏర్పాటు చేసుకున్నారు. వర్క్‌ ఫ్రం హోమ్‌ ద్వారా కార్యాలయాల్లో కంటే పని త్వరగా పూర్తవుతుందని యాజమాన్యాలు ప్రశంసిస్తున్నట్లు కొందరు ఉద్యోగులు చెబుతున్నారు. మహానగరరాలలో ఉండి పని చేసే కంటే ఇక్కడుండి పని చెస్తే ఏంతో సంతోషంగా ఉందని అంటున్నారు. 


సెలవులు తక్కువ.. హిరేకారి శ్రీహరీష్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, ఇప్పటూరు

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లా. ఈ రంగంలో సెలవులు చాలా తక్కువ. హోం సిక్‌గా ఉండేది. ఒక్కోసారి పండుగలప్పుడు కూడా సెలవులు దొరికేవి కావు. కరోనా ఎఫెక్ట్‌తో వర్క్‌ ఫ్రం హోం అవకాశం రావడంతో ఆనందంగా ఉంది. చాలా రోజుల తరువాత అమ్మ చేతి వంటలను రూచి చూస్తున్నా.


టెన్షన్‌ లేదు..జి.రుత్విక్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, పాలమూరు

కరోనా కారణంగా కంపెనీ వర్క్‌ ఫ్రం హోం అవకాశం ఇచ్చింది. ఇంటి నుంచే వర్క్‌ చేస్తుండటంతో ఇబ్బంది లేదు. టెన్షన్‌ కూడా చాలా తగ్గింది. పని ముగిసిన వెంటనే అమ్మానాన్నలతో కాలక్షేపం చేస్తున్నారు. 

Updated Date - 2020-09-13T09:09:41+05:30 IST