ఉపాధి పనులకు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2020-03-02T12:02:45+05:30 IST

ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని కూలీలకు వంద రోజులు పని కల్పించడానికి 2020-21వ ఆర్థిక సంవత్పరానికి గాను ఉపాధి ప్రణాళికను డీఆర్‌డీఏ

ఉపాధి పనులకు రంగం సిద్ధం

  • 2020-21 ఉపాధి ప్రణాళిక ఖరారు
  • 25 లక్షల పనిదినాలు
  • ఈ ఏడాది లక్ష్యం రూ.50 కోట్ల వ్యయం
  • 2019-20లో 18 లక్షల 38 వేల పనిదినాలు
  • కూలీలకు 36 కోట్ల 80 లక్షల చెల్లింపులు
  • పని చేసిన కూలీలు 85,846 మంది

గద్వాల:  ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని కూలీలకు వంద రోజులు పని కల్పించడానికి 2020-21వ ఆర్థిక సంవత్పరానికి గాను ఉపాధి ప్రణాళికను డీఆర్‌డీఏ అధికారులు పూర్తి చేశారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు, ఇతర ప్రాధాన్య రంగాలలో కూలీలకు పనులు కల్పించడానికి పనుల ప్రతిపాదనల జాబితాను సిద్ధం చేశారు. గత ఏడాది ఉపాధి కూలీలకు రోజు వారీగా ఇచ్చే వేతనానికి అదనంగా 20 నుంచి 30 శాతం కూలీని పెంచడంతో ఉపాధి కూలీలకు ఆశించిన మేరకు రోజు వారి కూలీ భత్యం దక్కింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం దినసరి కూలీని రూ.211 ఖరా రు చేసింది. ఉపాధి పనులు చేసే కూలీలకు దినసరి కూ లీతో పాటు వేసవి భత్యం కూడా దక్కుతుంది. దీనిని మార్చి నుంచి జూన్‌ వరకు ఇవ్వనున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు దాదాపుగా పూర్తవుతున్న సమయం లో గ్రామాలలో కూలీలు ఉపాధి పనులకు దరఖాస్తు చేసుకునే పనిలో కూలీలు ఉన్నారు. జిల్లాలో ఉపాధి కూలీల సంఖ్యకు అనుగుణంగానే గత మూడేళ్లల్లో జరిగిన ఉపాధి పనులను బేరీజు వేసుకుని అధిఽకారులు ఈ ఆర్ధిక సంవత్సరం 2020-21లో సుమారు 25 లక్షల పనిదినాలను ప్రతిపాదించి కూలీలకు పని కల్పించడానికి గాను వివిధ రకాల పనులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రప్రభుత్వం ఆమోదించిన పనులు కూడా ఇందులో ఉన్నాయి. వ్యవసాయ అనుబంధ పనులు ప్రతిపాదనలో ఉండే విధంగా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేశారు


పనులు ఇలా...    


ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులలో ప్రధానంగా వన నర్సరీలు, ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు లు, వైకుంఠ ధామాలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, గ్రామాలను కలిపే లింక్‌ రోడ్లు, సాగునీటి కాలువల్లో షీల్ట్‌ తొలగింపు, భూమి చదును, పాఠశాలల్లో వంట గదులు, మరుగుదొడ్ల నిర్మాణాలు, ఉద్యనవనాలు, వ్యవసాయ భూముల అభివృద్ధితో పాటు, నీటి తోట్లు, పశువుల షెడ్ల పనుల్లో ప్రతిపాదిస్తున్నారు. కాగా గత ఏడాది ఉపాధి పనుల్లో స్థానికంగా గ్రామాలలో తగు అవ సరాల మేరకు వ్యవసాయ రంగ పనులు చేపట్టవచ్చని నిబంధనలు మార్చడంతో ఆ మేరకు పనులను ప్రతిపాదించారు. ఇప్పటికే ఉపాధి పనుల కోసం గ్రామాలలో గ్రామసభల నిర్వహణ పూర్తి చేశారు. సభలలో వచ్చిన అభిప్రాయాలకు అనుగుణంగా పనులను ప్రతిపాదించారు. గత ఏడాది ఉపాధి పనులలో రాష్ట్రం యూనిట్‌గా మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులు చేపట్టారు. ఈ ఏడాది కూడా అదే విధానాన్ని చేపట్టనున్నారు. రెండేళ్ల క్రితం ఉపాధి కూలీలు చెల్లించడానికి అధికారులకు నిధులు కొరత అడ్డంకిగా మారింది.  ఈ ఏడాది అలాంటి పరిణామాలు ఎదురు కాకుండా, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న అధికారులు ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన కూలీలను సకాలంలో చెల్లించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. ఉపా ధి పనులు జరుగుతున్న చోట కూలీలకు అన్ని ఏర్పాట్లు చేయనున్నారు. టెంట్లు, ఓఆర్సీ ప్యాకెట్లు, తాగునీరుతో పాటు ప్రాథమిక చికిత్స కిట్లను కూడా పనుల దగ్గర అందుబాటులో ఉండే విధంగా చూస్తున్నారు. ఎండ తీవ్ర త ఎక్కువగా ఉంటే పనుల సమయాన్ని కుదించనున్నారు. 


2020-21లో ఉపాధి హామీ లక్ష్యం ఇలా..  


2019-20లో ఉపాధి హామీ పథకం కింద  18 లక్షల 38 వేల పనిదినాలు కల్పించారు. కూలీలకు రూ. 36 కోట్ల 80 లక్షలు చెల్లించారు. గత ఆర్థిక సంవత్పరంలో ఇంకా 30 రోజుల సమయం ఉన్నందున మరి కొంత పెరిగే అ వకాశం ఉంది. కాగా ఈ ఏడాది అంటే 2020-21లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 25 లక్షల పనిదినాలను కల్పించడానికి వివిధ రకాల పనులను ప్రతిపాదించింది. ఇందుకు గాను రూ. 50 కోట్లు అవసరం అవుతాయని అంచనాల ను రూపొందించింది. జిల్లాలో 1,45,795 జాబ్‌ కార్డులు ఉండగా, 3,29,488 మంది కూలీలు ఉన్నారు. కానీ 48,971 కుటుంబాల్లో జాబ్‌ కార్డులు ఉన్న వారు మాత్రమే ఉపాధి హామీ పనుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో పనులు చేపట్టిన వారు 85,846 మంది ఉన్నారు. ఇందు లో వంద రోజుల పనిదినాలు చేసిన వారు 3వేల మంది ఉన్నారని అధికారిక లెక్కలు చెపుతున్నాయి. 


ప్రభుత్వ ప్రాధాన్యం ప్రకారం పనులు... 

ఈ ఏడాది ఉపాధి హామీ పనులలో ప్రభుత్వం ప్రాధాన్యత రంగాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపడుతుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.50 కోట్లు వ్యయం కా గాల పనులు చేపట్టేందుకు గాను 25 లక్షల పనిదినాలకు ప్రతిపాదించాం. గ్రామాలలో పని అడిగిన ప్రతి కూలీకి పని కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.


- నర్సింహలు, డీఆర్‌డీఏ, జోగుళాంబ గద్వాల 

Updated Date - 2020-03-02T12:02:45+05:30 IST