రైతులకు బాసటగా నిలవాలి : గోపాలకృష్ణ

ABN , First Publish Date - 2020-12-31T02:54:40+05:30 IST

కేంద్రం తెచ్చిన కొత్త వ్యవ సాయ చట్టాలను తక్షణమే రద్దు చేసి రైతులకు బాసటగా నిలవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

రైతులకు బాసటగా నిలవాలి : గోపాలకృష్ణ

వనపర్తి టౌన్‌/మదనాపురం, డిసెంబరు 30: కేంద్రం తెచ్చిన కొత్త వ్యవ సాయ చట్టాలను తక్షణమే రద్దు చేసి రైతులకు బాసటగా నిలవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ముందు వ్యవసా య చట్టాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. తహసీల్దార్‌ రాజేందర్‌గౌడ్‌కు వినతిపత్రం అందిం చారు. నందిమళ్ల రాములు, భాగ్యమ్మ, కవిత పాల్గొన్నారు. మదనాపురంలోని తహసీల్దార్‌ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్‌ మాట్లాడుతూ కొత్త వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-12-31T02:54:40+05:30 IST