ఎయిడ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలి

ABN , First Publish Date - 2020-12-02T03:56:56+05:30 IST

ఎయిడ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలని వైద్యఆరోగ్యశాఖ జి ల్లా అధికారి చందూనాయక్‌ అ న్నారు.

ఎయిడ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలి
బ్యానర్‌ ఏర్పాటు చేస్తున్న అధికారులు

గద్వాలక్రైం, డిసెంబరు 1: ఎయిడ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలని వైద్యఆరోగ్యశాఖ జి ల్లా అధికారి చందూనాయక్‌ అ న్నారు. మంగళవారం ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సంద ర్భం గా జిల్లా కేంద్రంలోని డీఎం హెచ్‌ఓ కార్యాలయంలో వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎయిడ్స్‌ పై అవగాహన కల్పించేందుకు ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, అర్బన్‌ ప్రాంతాలలో, జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రద్దీ ప్రాంతాల్లో వాల్‌పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీపీఎంఓ ప్రేమ్‌ సాగర్‌, సూపరింటెండెంట్‌ రమేష్‌, సీసీ విష్ణు, జిల్లా ప్రోగ్రాం అధికారి కృష్ణసాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-02T03:56:56+05:30 IST