-
-
Home » Telangana » Mahbubnagar » agriculuture ofiicer
-
తుఫాన్ నుంచి పంటలను రక్షించుకోండి
ABN , First Publish Date - 2020-11-26T02:56:04+05:30 IST
నివర్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో గురు, శుక్రవారా ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, రైతులు తమ పంట దిగుబడులను రక్షించుకో వాలని జిల్లా వ్యవసాయాధికారి గోవిందనాయక్ తెలిపారు.

జిల్లా వ్యవసాయాధికారి గోవిందనాయక్
గద్వాల, నవంబరు25(ఆంధ్రజ్యోతి): నివర్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో గురు, శుక్రవారా ల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, రైతులు తమ పంట దిగుబడులను రక్షించుకో వాలని జిల్లా వ్యవసాయాధికారి గోవిందనాయక్ తెలిపారు. ఈ రెండు రోజుల పాటు వరి కోతలను నిలిపేయాలని, దిగుబడులు వర్షానికి తడవకుండా చూసుకోవాలన్నారు. రెండు రోజుల పాటు మార్కెట్‌యార్డుకు రైతులు ఎవరూ దిగుబడులను అమ్మకానికి తీసుకు రావద్దని బుధవారం ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.