నిర్లక్ష్యాన్ని సహించేది లేదు : అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

ABN , First Publish Date - 2020-12-11T03:47:14+05:30 IST

అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహిం చేది లేదని అదనపు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష హెచ్చరించారు.

నిర్లక్ష్యాన్ని సహించేది లేదు : అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష

- అమరవాయి పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం

    మానవపాడు, డిసెంబరు 10: అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష హెచ్చరించారు. మానవపాడుతో పాటు మండలంలోని నారాయణపురం, పెద్దఆముదాలపాడు, అమరవాయి గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. నర్సరీలలో సిబ్బంది కవర్లలో మట్టి నింపడం, మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. పారిశుధ్య నిర్వహణకు తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలను పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు వివరించారు. అమరవాయిలో పారిశుధ్యం లోపించడంతో పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రమణారావు, ఏపీఓ సౌజన్య తదితరులున్నారు.

Updated Date - 2020-12-11T03:47:14+05:30 IST