-
-
Home » Telangana » Mahbubnagar » adhyamika chinthana
-
ఆధ్యాత్మిక చింతనతో మెలగాలి
ABN , First Publish Date - 2020-12-20T03:04:47+05:30 IST
ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతనతో మెలగాలని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

అయ్యప్ప కొండ అభివృద్ధికి కృషి చెస్తా
మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, విద్యావిభాగం డిసెంబరు 19: ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతనతో మెలగాలని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రలోని పద్మావతి కాలనీలోగల అయ్యప్ప కొండపై గల అయ్యప్ప స్వామి దేవాలయం గుడి మెట్లు, సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప దేవాలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. మణికంఠ స్వామి దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడంపై నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ కేసీ నర్సిము లు, వైస్ చైర్మన్ తాటి గణేష్, కౌన్సిలర్ కట్టా రవికి షన్‌రెడ్డి, రామ్‌లక్ష్మణ్, కిషోర్, నవకాంత్ పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని కల్వరికొండలో రూ.25 లక్షలతో చేపట్టిన క్రిష్ఠియన్ కమ్యూనిటీ భవనాన్ని శనివారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.