విద్యార్థుల్లో చురుకుదనాన్ని పెంచుదాం

ABN , First Publish Date - 2020-02-08T10:12:00+05:30 IST

ప్రతి విద్యార్థికి అల్బెండజోల్‌ మాత్రలు అందించి వారిలో చురుకు దనాన్ని పెంచుదామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ శ్రీనివాసులు అన్నారు.

విద్యార్థుల్లో  చురుకుదనాన్ని పెంచుదాం

వనపర్తి వైద్య విభాగం: ప్రతి విద్యార్థికి అల్బెండజోల్‌ మాత్రలు అందించి వారిలో చురుకు దనాన్ని పెంచుదామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ శ్రీనివాసులు అన్నారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రైవేటు పాఠశాలల, కళాశాలల యాజమా న్యాలు నులిపురుగుల మాత్రల విశిష్టతపై శుక్రవారం అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుకుం టు న్న ప్రతివిద్యార్థికి  అల్బెండజోల్‌ మాత్రలు అందించే విధంగా పాఠశాల, కళాశాల సిబ్బంది చొరవ తీసుకోవాలన్నారు. ఈమాత్రలు 1-19 ఏళ్ల వారికి  తప్పకుండా తినిపించాలన్నారు. 1-2 సంవత్సరాల పిల్లలకు అర మాత్ర, 2-3 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్రను చూర్ణం చేసి మంచి నీటిలో కలిపి తాగించాలన్నారు.  మిగతావారికి ఒక మాత్రను నమిలి మింగించాలని సూ చించారు. ఈ విధంగా మాత్రలు తినిపించడం వల్ల విద్యార్థుల్లో చదువుపై ఏకాగ్రత పెంచడమే కాకుంగా రక్తహీనతలను నివారించవచ్చన్నారు. అందు కోసం వైద్యసిబ్బంది చూపించే నిబంధనల ప్రకారం విద్యార్థులకు నులిపురు గుల మాత్రలు ఇప్పించాలని తెలిపారు. ఈ నెల 10న జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పాటు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నులిపు రుగుల మాత్రలను వైద్య ఆరోగ్య శాఖ ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు. ఆ రోజు తప్పిపోయిన వారికి తిరిగి ఈనెల 17న మళ్లీ పంపిణీ చేస్తామ న్నారు.  డీఐవో డాక్టర్‌ శంకర్‌, హెల్త్‌ ఎడ్యూకేటర్స్‌ మద్దిలేటి ఉన్నారు. 

Updated Date - 2020-02-08T10:12:00+05:30 IST