నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ABN , First Publish Date - 2020-04-21T09:45:59+05:30 IST
లాక్‌డౌన్ నిబందనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వారావు అన్నారు.

కట్టడి ప్రాంతాలను పర్యవేక్షించిన ఇన్‌చార్జి ఎస్పీ
గద్వాలక్రైం, ఏప్రిల్ 20 : లాక్‌డౌన్ నిబందనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వారావు అన్నారు. జిల్లాకేంద్రంలోని కట్టడి ప్రాంతాలను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.
జిల్లాకేంద్రంలోని కట్టడి ప్రాంతాల్లోని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకూడదన్నారు. మోమిన్‌మెహల్లా, వేదనగర్, పాతహౌసింగ్‌బోర్డు కాలనీ, భీంనగర్, గంజిపేట ఏరియాల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు నిత్యావసర సరుకులు అందుతున్నాయా లేదా ఆరా తీసారు. సరుకులు అవసరమైతే వలంటీర్లను సంప్రదించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కృష్ణ, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ హనుమంతు, ఎస్‌ఐ సత్యనారాయణ ఉన్నారు.