కచ్చితమైన వివరాలు సేకరించాలి

ABN , First Publish Date - 2020-03-21T11:29:19+05:30 IST

విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు ఖచ్చితంగా సేకరించాలని కలెక్టర్‌ శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు

కచ్చితమైన వివరాలు సేకరించాలి

  • ఈగలపెంట వద్ద అంతరాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు
  • కలెక్టర్‌ శ్రీధర్‌


నాగర్‌కర్నూల్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) :  విదేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారి వివరాలు ఖచ్చితంగా సేకరించాలని కలెక్టర్‌ శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ మనుచౌదరితో పాటు ఆర్డీవోలు, డీఎస్పీలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, ఇతర మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కోవిడ్‌-19 వైరస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు, పంచాయతీ కార్యదర్శులతో ఇంటింటి సర్వే చేసి మార్చి 1నుంచి విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించాలన్నారు.విదేశాల నుంచి వచ్చిన వారు 14రోజులు ఇంట్లోనే ఉండాలపాకపనే. కరోనా ప్రత్యేకాధికారిగా డాక్టర్‌ శ్రవణ్‌ను నియమించినట్లు తెలిపారు. వివరాల కొరకు 9553942254 సంప్రందించాలన్నారు. కరోనా అనుమానిత వ్యక్తుల కొరకు జల్లా కేంద్రంలో 18బెడ్లతో ఐసోలేట్‌ వార్డు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 18 అంతరాష్ట్ర చెక్‌పోస్టులున్నాయని జిల్లాలో అంతరాష్ట్ర చెక్‌పోస్టును ఈగలపెంటలో ఏర్పాటు చేశామని, ధర్మల్‌ స్కానింగ్‌ ఏర్పాటుకు కలెక్టర్‌ ఆదేశించారు. 


కరోనాపై అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలో హెల్ప్‌డెస్క్‌ 9573500104 ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 31లోపు జరుపుకునే పెళ్లిళ్లకే అనుమతి అని ఆ తర్వాత అన్ని ఫంక్షన్‌ హాల్స్‌ మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్‌నాయక్‌, డీఎంహెచ్‌ సుధాకర్‌లాల్‌, డాక్టర్‌ సాయినాథ్‌రెడ్డి, డీపీవో సురేశ్‌మోహన్‌, సీఈవో నాగమణి, జిల్లా అధికారులు అఖిలేష్‌రెడ్డి, అనిల్‌ప్రకాశ్‌, డీఎస్పీ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. 


డాక్టర్లు నిర్లక్ష్యం వహించొద్దు..

ఆసుపత్రులకు వచ్చిన వ్యక్తుల పట్ల డాక్టర్లు నిర్లక్ష్యం వహించకూడదని కలెక్టర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. శుక్రవారం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తులపై నిఘా పెట్టి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లా ఆసుపత్రిలో 24గంటలు డాక్టర్లు అందుబాటులో ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తీసకుంటామన్నారు. 


సలేశ్వరం జాతర రద్దు

జిల్లాలో ఏప్రిల్‌ 7నుంచి ప్రారంభం కానున్న సలేశ్వరం జాతరను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు ప్రారంభమయ్యే జాతరలో కాలినడకన బయల్దేరి ప్రకృతి ఒడిలో వెలసిన లింగమయ్యకు భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. 

Updated Date - 2020-03-21T11:29:19+05:30 IST