లంచం అడిగితే సమాచారం ఇవ్వండి
ABN , First Publish Date - 2020-12-04T03:24:42+05:30 IST
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే త మకు సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోస్టర్లు అతికించిన ఏసీబీ
మహబూబ్‌నగర్, డిసెంబరు 3: ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే త మకు సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు గురువారం పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల ముందు ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి పోస్టర్లను అతికించారు. లంచం అడిగిన వారి వివరా లను 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి చెప్పాలన్నారు. ఈ సందర్భంగా పలు కార్యాల యా ల్లో ప్రభుత్వ ఉద్యోగులతో ఏసీబీ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ క్రిష్ణ మాట్లా డుతూ ప్రజలు అధికారులతో పనిచేయించుకోవడం వారి హక్కు అని లంచం ఇచ్చి పనులు చేయించుకోవద్దని, లంచం అడిగేవారు ఎవరైనా ఉంటే తమదృష్టికి తీసుకురావాలని కోరారు.