నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు

ABN , First Publish Date - 2020-03-15T12:51:34+05:30 IST

సమస్యల పరిష్కారం కోరుతూ శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఆపలేరని ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర

నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరు

ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి సునీత

వనపర్తి టౌన్‌, మార్చి 14: సమస్యల పరిష్కారం కోరుతూ శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాలను అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ఆపలేరని ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి సునీత అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో  శనివారం  సీఐ టీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆశ వర్కర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ శాంతియుతంగా ఆశ వర్కర్లు చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపడుతున్న తరుణంలో  రాష్ట్ర పభుత్వం పోలీసు లతో అక్రమ అరెస్టులను చేయించడం, ఉద్యమాలను అణిచి వేయాలను కోవడం సమంజసం కాదన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్న ప్రభుత్వం నేడు నిర్బంధాల తెలంగాణగా మారిందని విమర్శించారు.


కనీసం చేసిన కష్టానికి తగిన ప్రతి ఫలాన్ని అడగటం  కూడా రాష్ట్రంలో నేరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఆశాలు చేసిన 106 రోజుల ఉద్యమానికి స్పందించి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనే ఇంత వరకు అమలు చేయకపోవడం ఏంటని అన్నారు. సీఎం కేసీఆర్‌ నియంతృత్వం వల్ల తెలంగాణ అమరవీరుల ఆత్మలు క్షోభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను సాధించుకునేంత వరకు పోరా టాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహా య కార్యదర్శి గోపాలకృష్ణ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌  నాయ కులు బుచ్చమ్మ, చిట్టెమ్మ, నర్సుబాయి, భాగ్య, చంద్రకళ, నారా యణమ్మ, సుమిత్ర, విజయలక్ష్మీ, పారిజాత పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-15T12:51:34+05:30 IST