మండలానికి చేరుకున్న 97 మంది వలస కూలీలు

ABN , First Publish Date - 2020-05-17T10:27:49+05:30 IST

మండల పరిధిలోని ఆయా గ్రామాలు, పలు గిరిజన తండాలకు చెందిన 97 మంది వలస కూలీలు మండలానికి చేరుకున్నట్లు తహసీల్దార్‌ సరస్వతి

మండలానికి చేరుకున్న 97 మంది వలస కూలీలు

తిమ్మాజిపేట, మే 16: మండల పరిధిలోని ఆయా గ్రామాలు, పలు గిరిజన తండాలకు చెందిన 97 మంది వలస కూలీలు మండలానికి చేరుకున్నట్లు తహసీల్దార్‌ సరస్వతి తెలిపారు. తండాలకు చెందిన పలువురు కూలీలు బతుకు దెరువు కోసం హైదరాబాద్‌, ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లారు. మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ ప్రభుత్వం ప్రకటించడంతో స్వగ్రామాలకు రాలేక పోయారన్నారు.


మే 3న కేంద్ర ప్రభుత్వం వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఈనెల 4 నుంచి మండలం సరిహద్దులలో ప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి 67 మంది, తమిళనాడు, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి 30 మంది వలస కూలీలు వచ్చినట్లు ఆమె తెలిపారు.  

Updated Date - 2020-05-17T10:27:49+05:30 IST